Sree Vishnu : ఆ విషయం తెలిసుంటే నేనే మిమ్మల్ని హీరోయిన్ గా లాంచ్ చేసేవాడ్ని.. కొత్త హీరోయిన్ పై శ్రీ విష్ణు కామెంట్స్..

తాజాగా మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి శ్రీవిష్ణు గెస్ట్ గా హాజరయ్యారు. (Sree Vishnu)

Sree Vishnu : ఆ విషయం తెలిసుంటే నేనే మిమ్మల్ని హీరోయిన్ గా లాంచ్ చేసేవాడ్ని.. కొత్త హీరోయిన్ పై శ్రీ విష్ణు కామెంట్స్..

Sree Vishnu

Updated On : October 14, 2025 / 8:01 AM IST

Sree Vishnu : సోషల్ మీడియా లో ఇన్‌ఫ్లుయెన్సర్ గా బాగా ఫేమ్ తెచ్చుకుంది నిహారిక NM. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా ఏకంగా హాలీవుడ్ సినిమాలు ప్రమోషన్స్ కూడా చేసే స్థాయికి ఎదిగింది. సోషల్ మీడియా నుంచి నటిగా మారి తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ప్రియదర్శి, నిహారిక జంటగా తెరకెక్కుతున్న మిత్రమండలి సినిమా అక్టోబర్ 16 న రిలీజ్ కానుంది.(Sree Vishnu)

తాజాగా మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్ కి శ్రీవిష్ణు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ ని ఉద్దేశించి శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Bunn Vasu : వాళ్ళు దొంగనా కొడుకులు.. దర్శక నిర్మాతలపై బన్నీ వాసు కామెంట్స్ వైరల్..

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. నిహారిక గారు లాక్ డౌన్ లో మీ రీల్స్ చూసాను. నేను ఎవర్ని కాపీ చేయాలని అనుకోను. కానీ మీ రీల్స్ లో మీరు చేసినవి కొన్ని చూసి అలా చేయాలి అనుకున్నాను. బాగా చేస్తుంది, మంచి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది ఈ అమ్మాయి అనుకున్నాను. మీరు తెలుగు అమ్మాయి అని నాకు తెలీదు. అందుకే అప్రోచ్ అవ్వలేదు. ఒకవేళ తెలిసి ఉంటే నేనే మిమ్మల్ని హీరోయిన్ గా లాంచ్ చేసేవాడ్ని. కానీ ఇప్పుడు దర్శి లాంచ్ చేస్తున్నాడు అని అన్నారు. మరి భవిష్యత్తులో శ్రీవిష్ణు సినిమాలో నిహారిక నటిస్తుందేమో చూడాలి.

Also See : Mithra Mandali Pre Release Event : ‘మిత్ర మండలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..