Bunn Vasu : వాళ్ళు దొంగనా కొడుకులు.. దర్శక నిర్మాతలపై బన్నీ వాసు కామెంట్స్ వైరల్..

తాజాగా బన్నీవాసు సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. (Bunn Vasu)

Bunn Vasu : వాళ్ళు దొంగనా కొడుకులు.. దర్శక నిర్మాతలపై బన్నీ వాసు కామెంట్స్ వైరల్..

Bunn Vasu

Updated On : October 14, 2025 / 7:41 AM IST

Bunn Vasu : తాజాగా బన్నీవాసు సరదాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బన్నీ వాసు సమర్పణలో వస్తున్న మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కి బన్నీ వాసు హాజరయ్యారు.(Bunn Vasu)

మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ బన్నీ వాసుని మీ లైఫ్ లో మిత్రమండలి అనిపించే ఓ నలుగురు పేర్లు చెప్పండి అని అడగ్గా బన్నీ వాసు.. అంటే నాతో తిరిగే నలుగురు దొంగనా కొడుకులు చెప్పమంటారు అన్నారు.

Also Read : Rag Mayur : ‘జానీ’ అంటే పిచ్చెక్కిపోయేవాడ్ని.. పవన్ సర్ సినిమాలో ఛాన్స్ ఇప్పించండి.. స్టేజిపై నటుడి కామెంట్స్ వైరల్..

బన్నీ వాసు చెప్తూ.. మొదటి దొంగ నా కొడుకు నిర్మాత SKN, రెండు ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నారు కాబట్టి గౌరవంగా మారుతి గారు అంటాను, అలాగే నా చిన్నప్పట్నుంచి ఫ్రెండ్ భాను మిత్రమండలి నిర్మాత, ఇంకొకరు వరుణ్ దగ్గర ఉంటారు ఆర్కే అని వాడు అందరికన్నా పెద్ద దొంగనా కొడుకు. మా నలుగురు హిస్టరీలు తీస్తే మిత్రమండలి సరిపోదు అంత దారుణంగా ఉంటుంది అని అన్నారు.

బన్నీ వాసు సరదాగా తన క్లోజ్ ఫ్రెండ్స్ గురించి చెప్పినా ఇలా స్టేజి మీద దర్శక నిర్మాతలను దొంగ నా కొడుకులు అని అనడంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read : Priyadarshi : మొన్న నాని.. ఇప్పుడు ప్రియదర్శి.. నా నెక్స్ట్ సినిమా చూడకండి.. సంచలన స్టేట్మెంట్..