Rag Mayur : ‘జానీ’ అంటే పిచ్చెక్కిపోయేవాడ్ని.. పవన్ సర్ సినిమాలో ఛాన్స్ ఇప్పించండి.. స్టేజిపై నటుడి కామెంట్స్ వైరల్..
రాగ్ మయూర్ కీలక పాత్రలో నటించిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.(Rag Mayur)

Rag Mayur
Rag Mayur : సినిమా బండి, శ్రీరంగ నీతులు, కీడా కోలా, వీరాంజనేయులు విహార యాత్ర, గాంధీ తాత చెట్టు, పరదా.. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రాగ్ మయూర్. హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తున్నాడు. రాగ్ మయూర్ కీలక పాత్రలో నటించిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.(Rag Mayur)
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో రాగ్ మయూర్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అని, పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ ఇప్పించమంటూ మాట్లాడాడు.
Also Read : Priyadarshi : మొన్న నాని.. ఇప్పుడు ప్రియదర్శి.. నా నెక్స్ట్ సినిమా చూడకండి.. సంచలన స్టేట్మెంట్..
రాగ్ మయూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడానికి ఇంకో ముఖ్య కారణం ఇది బన్నీ వాసు గారి నిర్మాణ సంస్థ అని. ఆయన దగ్గర చేస్తే నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లొచ్చు అని. ఏదో ఒకరోజు బన్నీ వాసు గారు ఆయనకు రికమండ్ చేసి పవన్ సర్ సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తారని ఆశ. నాకు జానీ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. అప్పట్లో పిచ్చెక్కిపోయేవాడ్ని ఆ సినిమా, ఆ సినిమాలో బట్టలు, తలకు కట్టుకునే బ్యాండ్ చూసి. అప్పట్లో మా అమ్మని అలా నా పేరు కుట్టి బ్యాండ్ ఇస్తావా అంటే పో అంది. అందుకే ఈ సినిమాలో ఒక బ్యాండ్ నా క్యారెక్టర్ అభి పేరుతో కుట్టించుకున్నాను. ఇదంతా నేనే చేయించుకున్నా. థ్యాంక్యూ బన్నీ వాసు సర్. ఏదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. దీంతో రాగ్ మయూర్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి భవిష్యత్తులో రాగ్ మయూర్ పవన్ కళ్యాణ్ ని కలుస్తాడా, ఆయన సినిమాలో నటిస్తాడా చూడాలి.