Bunny Vasu : తొక్కితే పడిపోతాడు అనుకుంటే నా వెంట్రుక.. డబ్బులిచ్చి సినిమాపై నెగిటివ్ చేస్తున్నారు.. సంచలన కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించి..?

ఈ ఈవెంట్ కి హాజరయిన బన్నీ వాసు తన సినిమాని, తనని తొక్కడానికి చూస్తున్నారు అంటూ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.(Bunny Vasu)

Bunny Vasu : తొక్కితే పడిపోతాడు అనుకుంటే నా వెంట్రుక.. డబ్బులిచ్చి సినిమాపై నెగిటివ్ చేస్తున్నారు.. సంచలన కామెంట్స్.. ఎవరిని ఉద్దేశించి..?

Bunny Vasu

Updated On : October 13, 2025 / 10:38 PM IST

Bunny Vasu : నిర్మాత బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బన్నీ వాసు నిర్మాణంలో వస్తున్న మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి హాజరయిన బన్నీ వాసు తన సినిమాని, తనని తొక్కడానికి చూస్తున్నారు అంటూ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.(Bunny Vasu)

బన్నీ వాసు మాట్లాడుతూ.. అందరి సినిమాలు హిట్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి. అందరితో మనమూ ఎదగాలి. ఇది నా ఆటిట్యూడ్. అలా కాదు నేను ఒక సినిమాని తొక్కుతేనే పక్క సినిమా ఎదుగుద్ది. నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే ఇంకో సినిమా ఎదుగుద్ది అంటే అది మీ ఖర్మ. మేము ఎవ్వరం ఏమి చేయలేము. ఇక్కడ సినిమా బాగుంటే చూస్తారు. మీదైనా నాదైనా సినిమా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది.

Also Read : Bison Trailer : విక్రమ్ కొడుకు ధృవ్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా? కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రా & రస్టిక్..

ఒక సినిమా మీద డబ్బులు పెట్టి నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే ఆ సినిమా తగ్గుతుంది, ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది చిన్నపిల్లాడి తత్త్వం. మన అందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి. కష్టపడదాం ఎదుగుదాం. అంతే కానీ ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తే ఎదిగిపోతాం అంటే పైన దేవుడు ఉన్నాడు, ప్రేక్షకులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు.

కాంపిటేషన్ లోనే ఉండాలి కానీ ధర్మం ఉండాలి. నేనైతే అన్ని సినిమాలు బాగుండాలనే కోరుకుంటాను. ఒకవేళ నా సినిమా బాగోకపోతే బాగున్న సినిమా బాగుండాలి అని కోరుకుంటాను. అదే నా మైండ్. అందుకే సక్సెస్ వస్తుంది. ఇదేదో చేస్తే బన్నీ వాసు పడిపోతాడు, ఇక్కడ తొక్కితే పడిపోతాడు అనుకుంటే నా వెంట్రుక. నా సంస్కారం ఏంటంటే తల వెంట్రుక తీసి ఇస్తున్నా. నా జర్నీ ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాను. మీ గురించి ఆలోచిస్తే ఇక్కడే ఉంటాను నేను. మీరు ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా చేసుకోండి. నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్, రివ్యూస్ కి వెల్కమ్. ఏదైనా ఫేస్ చేస్తాను అని అన్నారు.

Also Read : NTR Sons : మేనమామ పెళ్ళిలో ఎన్టీఆర్ తనయుల సందడి.. ఒళ్ళో కూర్చోపెట్టుకున్న కొత్త పెళ్లికూతురు.. వీడియో వైరల్..

Bunny Vasu

దీంతో బన్నీ వాసు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అయితే బన్నీ వాసు ఎవరిని ఉద్దేశించి అన్నారు, బన్నీ వాసుని, బన్నీ వాసు సినిమాపై ఎవరు నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈ దీపావళికి రిలీజ్ అవుతున్న సినిమాల్లోనే ఓ సినిమాకు సంబంధించిన నిర్మాతలు ఇది చేశారేమో అని పలువురు అనుకుంటున్నారు. మరి బన్నీ వాసు కామెంట్స్ మీద ఎవరైనా టాలీవుడ్ నుంచి స్పందిస్తారేమో చూడాలి.