NTR Sons : మేనమామ పెళ్ళిలో ఎన్టీఆర్ తనయుల సందడి.. ఒళ్ళో కూర్చోపెట్టుకున్న కొత్త పెళ్లికూతురు.. వీడియో వైరల్..
తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది. (NTR Sons)

NTR Sons
NTR Sons : ఇటీవల ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లి జరిగింది. హీరో వెంకటేష్ బంధువుల అమ్మాయి శివానితో నార్నె నితిన్ వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి అనేకమంది సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణీత సొంత తమ్ముడు కావడంతో బామ్మర్ది పెళ్ళిలో ఎన్టీఆర్ కూడా హడావిడి చేసారు. నార్నె నితిన్ పెళ్ళిలో ఎన్టీఆర్ సందడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.(NTR Sons)
అయితే తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ తనయులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లు కొత్త జంటతో సందడి చేసిన వీడియో బయటకు వచ్చింది. మేనమామ పెళ్లి కావడంతో అభయ్, భార్గవ్ ఇద్దరూ సందడి చేయగా ఇప్పటికే పలు వీడియోలు బయటకు వచ్చాయి.
ఈ వీడియోలో ఫోటో దిగడానికి అభయ్ రామ్ మేనమామ పక్కన కూర్చోగా భార్గవ్ రామ్ ని కొత్త పెళ్లి కూతురు శివాని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఫొటోలు దిగింది. పక్కనే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి కూడా చేరింది. మొత్తానికి మేనమామ పెళ్ళిలో ఎన్టీఆర్ తనయులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ క్యూట్ గా సందడి చేసి బాగా వైరల్ అయ్యారు. వీడియో మీరు కూడా చూసేయండి..
View this post on Instagram
Also See : Pooja Hegde : పూజాహెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..