Kiran Abbavaram : విజయ్ దేవరకొండ డైరెక్టర్ తో.. భారీ పొలిటికల్ వెబ్ సిరీస్.. కిరణ్ అబ్బవరం లైనప్ మాములుగా లేదుగా..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమాల గురించి తెలిపాడు. అలాగే వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నట్టు తెలిపాడు.(Kiran Abbavaram)

Kiran Abbavaram
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అక్టోబర్ 17న K ర్యాంప్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.(Kiran Abbavaram)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమాల గురించి తెలిపాడు. అలాగే వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నట్టు తెలిపాడు.
కిరణ్ అబ్బవరం తాను చేస్తున్న వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. డియర్ కామ్రేడ్ సినిమా డైరెక్టర్ భరత్ కమ్మతో వెబ్ సిరీస్ చేస్తున్నాను. అమెజాన్ ప్రైమ్ వాళ్లకు ఈ సిరీస్ చేస్తున్నాము. ఇది భారీ పొలిటికల్ సిరీస్. మూడు సీజన్లు ఉంటుంది. చాలా మంచి స్టోరీ. పెద్దకథ. మీర్జాపూర్ లాగ వర్కౌట్ అవుతుంది. పాన్ ఇండియా వైడ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అని తెలిపాడు. దీంతో కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది.
అలాగే.. K ర్యాంప్ తర్వాత నాలుగు సినిమాలు ఉన్నాయని. ఒక్కోటి ఒక్కో జానర్ అని తెలిపాడు. చెన్నై లవ్ స్టోరీ సినిమా, ఇంకా కామెడీతో పాటు పీరియాడిక్, థ్రిల్లర్ సినిమాలు చేస్తున్నాను అని చెప్పాడు. తమిళ్ డైరెక్టర్ తో భారీ సినిమా చేస్తున్నాను అని, దానికి అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడని, అలాగే శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను అని తెలిపాడు. దీంతో కిరణ్ అబ్బవరం చేతిలో ఆల్మోస్ట్ అరడజను సినిమాలు, ఒక వెబ్ సిరీస్ ఉన్నాయని తెలుస్తుంది.