Priyadarshi : మొన్న నాని.. ఇప్పుడు ప్రియదర్శి.. నా నెక్స్ట్ సినిమా చూడకండి.. సంచలన స్టేట్మెంట్..
తాజాగా ఇప్పుడు అదే స్టేట్మెంట్ ప్రియదర్శి ఇచ్చాడు. (Priyadarshi)

Priyadarshi
Priyadarshi : ఇటీవల హీరోలు, దర్శక నిర్మాతలు తమ సినిమా బాగా వస్తే ప్రమోషన్స్ లో భారీ డైలాగ్స్ వేసేసి ఛాలెంజ్ లు చేసేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నాని నిర్మాతగా చేసిన కోర్ట్ సినిమా ప్రమోషన్స్ లో ఆ సినిమా బాగోకపోతే, నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా హిట్ 3 చూడొద్దు అని అన్నారు. ఆ స్టేట్మెంట్ కి టాలీవుడ్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ డేరింగ్ స్టేట్మెంట్ ఒక్కసారిగా వైరల్ అయి నాని చర్చల్లో నిలిచాడు.(Priyadarshi)
తాజాగా ఇప్పుడు అదే స్టేట్మెంట్ ప్రియదర్శి ఇచ్చాడు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా దూసుకుపోతున్నాడు ప్రియదర్శి. ప్రియదర్శి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న జరగనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియదర్శి మాట్లాడుతూ.. మిత్రమండలి సినిమా హిట్ అవ్వకపోతే, మీకు నచ్చకపోతే నా నెక్స్ట్ సినిమా చూడకండి. అప్పుడు నాని అన్న చెప్పాడు. ఆయన దగ్గర్నుంచి నేర్చుకున్నా. ఇది నా ప్రామిస్. ఇది సినిమా మీద నాకున్న కమిట్మెంట్ అని అన్నారు. దీంతో ప్రియదర్శి కామెంట్స్ వైరల్ గా మారాయి.
ప్రియదర్శి నెక్స్ట్ సినిమా ‘ప్రేమంటే’. ఈ సినిమాలో యాంకర్ సుమ కీలక పాత్రలో నటించింది. దీంతో మిత్రమండలి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యాంకరింగ్ చేసిన సుమ.. ఎలాగైనా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే ప్రియదర్శి నెక్స్ట్ సినిమాలో నేను ఉన్నాను అని అన్నారు.
Also Read : Bison Trailer : విక్రమ్ కొడుకు ధృవ్ కొత్త సినిమా ట్రైలర్ చూశారా? కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రా & రస్టిక్..