OG Movie
OG Movie : పవన్ కళ్యాణ్ OG మూవీ నిర్మాణం నుండి డివివి సంస్థ తప్పుకున్నట్లు సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది డీవీవీ సంస్థ. పవన్ OG సినిమాని డీవీవీ దానయ్య సారథ్యంలోని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. గతేడాది ఈ సినిమా 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత షూటింగ్ నిలిపివేసారు.
మరోవైపు పవన్ తన జనసేన పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో పవన్ మరో నాలుగైదు నెలల వరకు సినిమాలు చేసే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే డీవీవీ దానయ్య తన ఆర్ధిక భారాన్ని తగ్గించుకోవాలని OG నుండి వైదొలగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో పవన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఇక OG సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టేకోవర్ చేసుకుందని.. దాని పేరుతో ముందుకు సాగుతుందని న్యూస్ వచ్చింది. ఈ వార్తలపై రెండు నిర్మాణ సంస్థలు క్లారిటీ ఇచ్చాయి. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసాయి. ఈ విషయంపై డీవీవీ సంస్థ అమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మళ్లీ క్లారిటీ ఇచ్చింది. ‘OG మాదే.. OG ఎప్పటికీ మాదే.. పవన్ కల్యాణ్ గారి సినిమా ఎలా తెరకెక్కుతుందనే దానిపై మాకు పూర్తి క్లారిటీ ఉంది. మేము దాని దిశగా ముందుకు సాగుతున్నాము. ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. ఆకలి ఎక్కువ కాలం ఉంటుంది, కానీ చిరుత వేట ఏమీ వదిలిపెట్టదు..#TheyCallHimOG’ అనే శీర్షికతో ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ఈ పోస్టు చూసి పవన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: మళ్ళీ సరికొత్తగా రాబోతున్న ఉపేంద్ర.. ‘వరల్డ్ అఫ్ UI’ చూశారా?
గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తున్న ‘OG’ లో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ నటించారు. సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
#OG is ours… #OG will be forever ours…❤️?
We have full clarity on how Pawan Kalyan garu’s film will unfold. We are progressing towards it. Always thankful to him.
The hunger will be for a longer time, but the Cheetah hunt will leave nothing behind. ? #TheyCallHimOG pic.twitter.com/KgSZFIeI27
— DVV Entertainment (@DVVMovies) January 8, 2024