Upendra : మళ్ళీ సరికొత్తగా రాబోతున్న ఉపేంద్ర.. ‘వరల్డ్ అఫ్ UI’ చూశారా?
ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘యూఐ : ది మూవీ’ తాజాగా వరల్డ్ ఆఫ్ UI పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేశారు.

Upendra New Upcoming Movie UI The Movie Glimpse World of UI Released
Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర (Upendra) తెలుగులో కూడా తన చిత్ర విచిత్రమైన సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలు కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. పలు టాలీవుడ్ సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యారు. ఉపేంద్ర నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.
ఓం, A, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్.. లాంటి పలు కొత్త కథలతో దర్శకుడిగా కూడా ప్రేక్షకులని మెప్పించాడు ఉపేంద్ర. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మరో సరికొత్త కథతో రాబోతున్నాడు. ఇటీవల ఉపేంద్ర పుట్టిన రోజు నాడు ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘యూఐ : ది మూవీ’(UI The Movie)సినిమాని ప్రకటించారు. అప్పుడే దాని నుంచి ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
Also Read : Manchu Lakshmi : ముంబైలో మంచు లక్ష్మి కొత్త ఇల్లు చూశారా? పూర్తిగా ముంబైకి మకాం మార్చేసిన లక్ష్మి మంచు..
తాజాగా వరల్డ్ ఆఫ్ UI పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ లేకపోయినా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే మైండ్ బ్లోయింగ్ అయ్యేలా చేశాడు ఉపేంద్ర. దీంతో ఈసారి కూడా ఉపేంద్ర ఏదో కొత్తగానే చూపించబోతున్నాడు అని అభిమానులు ఈ సినిమా నాకోసం ఎదురు చూస్తున్నారు. వరల్డ్ ఆఫ్ UI వీడియో మీరు కూడా చూసేయండి.