Rajamouli : రాజమౌళి ఇండస్ట్రీని పాడు చేశారు.. డిస్ట్రిబ్యూటర్ సంచలన వ్యాఖ్యలు..

ఈస్ట్ గోదావరి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

East Godavari Distributer Satyanarayana Sensational Comments on Rajamouli

Rajamouli : తన సినిమాలతో తెలుగు సినిమాని పాన్ ఇండియా, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి. ఏకంగా ఎవరికీ సాధ్యం కాదు అనుకున్న ఆస్కార్ అవార్డు కూడా తెలుగు సినిమాకు వచ్చేలా చేశారు. తెలుగు సినిమాకు గౌరవం తీసుకొచ్చారు, ప్రపంచమంతా తెలుగు సినిమాని తీసుకెళ్లారు అని అంతా రాజమౌళిని పొగుడుతున్నారు. అయితే తాజాగా ఓ డిస్ట్రిబ్యూటర్ రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత కొన్ని రోజులుగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ – నిర్మాతలు వివాదం కొనసాగుతుంది. పెద్ద సినిమాలు కూడా పర్శంటేజ్ విధానంలోనే ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ అడుగుతున్నారు. సరైన సినిమాలు రాక, సినిమా థియేటర్స్ కి ప్రేక్షకులు రాక, ఓటీటీలకు త్వరగా సినిమాలు ఇచ్చేస్తుండటంతో, టికెట్ రేట్లు పెంచడంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో పాటు నిర్మాతలు కూడా నష్టపోతున్నారు. అయినా నిర్మాతలు వీటిపై స్పందించట్లేదు. మే 18న దీనికి సంబంధించి నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్స్ కి మీటింగ్ జరగనుంది.

Also Read : Karate Kid – Legends : ‘కరాటే కిడ్ : లెజెండ్స్’ కోసం తండ్రి కొడుకులు.. అజయ్ దేవగణ్ – యుగ్ దేవగణ్..

ఈ క్రమంలో ఈస్ట్ గోదావరి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజమౌళి ఇండస్ట్రీని పాడు చేసేసారు. హీరోల డేట్స్ సంవత్సరాలు సంవత్సరాలు లాక్ చేస్తారు. దాంతో ఫ్యాన్స్ బాధపడతారు. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ పరిస్థితి అదే. అంతేకాక వాళ్ళను సంవత్సరాలు ఆపేస్తుంటే తక్కువ సినిమాలు వస్తాయి. హీరోలను పాన్ ఇండియా సక్సెస్ అంటే మళ్ళీ వాళ్ళు అదే మూడ్ లో ఉండి, హై బడ్జెట్ లో సినిమాలు తీయాలనే ఆలోచిస్తున్నారు. అందర్నీ పాన్ ఇండియా మోజుకు తీసుకెళ్లిపోయారు రాజమౌళి. ఆయన తెలుగు ఇండస్ట్రీ పేరు తెచ్చారు, ఆయన గొప్ప అని ఒప్పుకోవచ్చు కానీ ఏళ్లకు ఏళ్ళు సినిమాలు తీస్తే హీరోలు ఆగిపోయి సినిమాలు తగ్గిపోతున్నాయి, పాన్ ఇండియా మోజు అని బడ్జెట్స్ పెంచేస్తున్నారు అని అన్నారు. దీంతో ఈయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఈ డిస్ట్రిబ్యూటర్స్ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

Also See : Movie Opening : విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా ఓపెనింగ్ లో రష్మిక మందన్న.. ఫొటోలు చూశారా?