Karate Kid – Legends : ‘కరాటే కిడ్ : లెజెండ్స్’ కోసం తండ్రి కొడుకులు.. అజయ్ దేవగణ్ – యుగ్ దేవగణ్..
అజయ్ తనయుడు యుగ్ దేవగణ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Ajay Devgn Yug Devgan Dubbing for Karate Kid Legends in Hindi
Karate Kid – Legends : సూపర్ హిట్ చైనీస్ ఫ్రాంచైజ్ సినిమా కరాటే కిడ్ నుంచి ఇప్పటికే అయిదు సినిమాలు రాగా ఇప్పుడు ఆరో సినిమా కరాటే కిడ్ – లెజెండ్స్ రానుంది. ఈ సినిమాని ఇప్పుడు ఇండియాలో కూడా డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే హిందీలో కరాటే కిడ్ : లెజెండ్స్ సినిమాకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, అతని కొడుకు యుగ్ దేవగణ్ డబ్బింగ్ చెప్పారు.
దీంతో అజయ్ తనయుడు యుగ్ దేవగణ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబైలో గ్రాండ్ గా సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో తండ్రి కొడుకులు అజయ్ దేవగణ్ – యుగ్ దేవగణ్ సందడి చేశారు. కరాటే కిడ్ : లెజెండ్స్ సినిమాలో అజయ్ దేవగణ్ జాకీ చాన్ పోషించిన మిస్టర్ హాన్ పాత్రకు, యుగ్ దేవగణ్ బెన్ వాన్గ్ పోషించిన లీ ఫాంగ్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
Also Read : Rashmika Mandanna : ‘బేబీ’ కాంబోలో మరో సినిమా ఓపెనింగ్.. ఆనంద్ దేవరకొండ కోసం వచ్చిన రష్మిక..
ఇక ‘కరాటే కిడ్: లెజెండ్స్’ కథ న్యూయార్క్ నేపథ్యంలో సాగుతుంది. కుంగ్ ఫూ ప్రతిభావంతుడు లీ ఫాంగ్ కొత్త పాఠశాలలో కొత్త జీవితం మొదలుపెట్టగా అక్కడున్న కొంతమందితో తన జీవితం మళ్ళీ ఎలా మారింది? కరాటేలోకి ఎలా వచ్చాడు అని ఆసక్తికరంగా ఉండనుంది. ఇక ఈ సినిమా మే 30న రిలీజ్ కానుంది.