Rashmika Mandanna : ‘బేబీ’ కాంబోలో మరో సినిమా ఓపెనింగ్.. ఆనంద్ దేవరకొండ కోసం వచ్చిన రష్మిక..
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా రష్మిక మందన్న వచ్చి క్లాప్ కొట్టింది.

Rashmika Mandanna Came as Guest for Anand Deverakonda Vaishnavi Chaitanya Movie Opening
Rashmika Mandanna : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. తాజాగా వీరి కాంబోలో మరో సినిమా రాబోతుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు.
అయితే ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్ గా రష్మిక మందన్న వచ్చి క్లాప్ కొట్టింది. దీంతో విజయ్ తమ్ముడు ఆనంద్ కోసం రష్మిక వచ్చిందని ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.
ఇటీవల ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఈటీవి విన్ ఓటీటీలో వచ్చిన #90’s (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్ కు కొనసాగింపుగా ఈ సినిమా ఉండనుంది అని ఆ వీడియోతో తెలుస్తుంది. 90’s సిరీస్‌లో చిన్నపిల్లవాడు అయిన ఆదిత్య పది సంవత్సరాల తరువాత పెద్దవాడు అయితే అతని లవ్ స్టోరీతో ఈ సినిమా ఉండబోతుంది. 90s సిరీస్ లో ఉన్న శివాజీ, వాసుకి ఈ సినిమాలో కూడా కంటిన్యూ ఉండబోతున్నారు.
And it begins for the MOST RELATABLE LOVE STORY 😍@SitharaEnts Production No. 32 takes off with a pooja ceremony full of love ❤️
&
Regular shoot commences this June 🫶🏻Clap by @iamRashmika
Camera Switch On by @ActorSivaji
Script handover by #VenkyAtluri & @kalyanshankar23… pic.twitter.com/POVPgdqhco— Sithara Entertainments (@SitharaEnts) May 15, 2025