Faria Abdullah : ఛాన్స్ వస్తే అల్లు అర్జున్ కి డ్యాన్స్ కంపోజ్.. నన్ను కలిసినప్పుడు అల్లు అర్జున్ ఏమన్నారంటే..

ఫరియా హీరోయిన్ గా కంటే ముందు డ్యాన్సర్, ర్యాప్ సింగర్ అని తెలిసిందే.

Faria Abdullah : ఛాన్స్ వస్తే అల్లు అర్జున్ కి డ్యాన్స్ కంపోజ్.. నన్ను కలిసినప్పుడు అల్లు అర్జున్ ఏమన్నారంటే..

Faria Abdullah Wants to Compose Dance for Allu Arjun in Movies

Updated On : May 15, 2025 / 10:56 AM IST

Faria Abdullah : జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా ఫేమ్ తెచ్చుకొని ప్రస్తుతం వరుస సినిమాలు, షోలతో దూసుకుపోతుంది ఫరియా అబ్దుల్లా. ఓ పక్కన హీరోయిన్ గా చేస్తూనే మరోపక్క గెస్ట్ రోల్స్, టీవీ షోలలో జడ్జిగా చేస్తూ అలరిస్తుంది. తాజాగా యాంకర్ సుమ చాట్ షో ఇంటర్వ్యూ ప్రోగ్రాంకి ఫరియా రాగా పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

అయితే ఫరియా హీరోయిన్ గా కంటే ముందు డ్యాన్సర్, ర్యాప్ సింగర్ అని తెలిసిందే. ఓ సినిమాలో డ్యాన్స్ కూడా కంపోజ్ చేసింది ఫరియా. అనేక డ్యాన్స్ ఈవెంట్స్ లో కూడా స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చింది.

Also Read : Samantha : మరోసారి రాజ్ తో ‘సమంత’.. భుజంపై తలవాల్చి.. ప్రతిసారి సమంత హింట్స్ ఇస్తుందా?

ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ప్రస్తావన రాగా ఫరియా మాట్లాడుతూ.. నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ వస్తే ఫస్ట్ అల్లు అర్జున్ కి డ్యాన్స్ కంపోజ్ చేస్తాను. నేను అల్లు అర్జున్ ని కలిసినపుడు.. నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు కదా అన్నారు. మీకెలా తెలుసు అని అడిగితే నాకు అన్ని తెలుస్తాయి అని నవ్వేశారు. ఫ్యూచర్ లో మనం కలిసి డ్యాన్స్ చేద్దాం అన్నారు. నాకు కంపోజింగ్ ఛాన్స్ ఇస్తే అందరి హీరోలకు కంపోజ్ చేస్తాను. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అని తెలిపింది. మరి ఫరియాకి హీరోయిన్ గా కాకుండా డ్యాన్స్ మాస్టర్ గా ఎవరు ఆఫర్ ఇస్తారో చూడాలి.

Also Read : Ketika Sharma : హమ్మయ్య కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టిన హాట్ భామ.. చీరలో లేటెస్ట్ ఫొటోలు..