Samantha : మరోసారి రాజ్ తో ‘సమంత’.. భుజంపై తలవాల్చి.. ప్రతిసారి సమంత హింట్స్ ఇస్తుందా?

తాజాగా సమంతా మరోసారి రాజ్ నిడుమోరుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

Samantha : మరోసారి రాజ్ తో ‘సమంత’.. భుజంపై తలవాల్చి.. ప్రతిసారి సమంత హింట్స్ ఇస్తుందా?

Samantha Shares Close Photos with her Rumored Boy Friend Raj Nidimoru

Updated On : May 15, 2025 / 10:25 AM IST

Samantha : సమంత హెల్త్ సమస్యలు అని సినిమాలకు గ్యాప్ ఇచ్చినా సినిమా ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే నిర్మాతగా మారి శుభం అనే ఓ చిన్న సినిమా చేసింది. హారర్ కామెడీతో తెరకెక్కించిన ఈ శుభం సినిమా ఫ్యామిలీలకు కనెక్ట్ అయింది. ఈ సినిమాతో సమంత బాగానే లాభాలు రాబట్టింది. అయితే సమంత గురించి ఇటీవల తన సినిమాలు, హెల్త్ కంటే కూడా రాజ్ తో ప్రేమలో ఉందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడుమోరుతో సమంత ప్రేమలో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టు సమంత కూడా ఇప్పటికే అనేకమార్లు రాజ్ తో కలిసి బయట కనపడింది. వీరిద్దరూ క్లోజ్ గా తిరగడం, ఎయిర్ పోర్ట్స్ లో కూడా ఇద్దరు కలిసి నడవడం, సమంత రాజ్ తో దిగిన ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం, వీరిద్దరూ కలిసి ఓ బిజినెస్ చేస్తుండటం, సమంత శుభం సినిమాకి రాజ్ కూడా పనిచేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి.

Also Read : Ketika Sharma : హమ్మయ్య కెరీర్లో ఫస్ట్ హిట్ కొట్టిన హాట్ భామ.. చీరలో లేటెస్ట్ ఫొటోలు..

తాజాగా సమంతా మరోసారి రాజ్ నిడుమోరుతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. శుభం సినిమా మెమరీస్ అంటూ పలు ఫొటోలు షేర్ చేసినా ఇందులో ఓ ఫొటోలో సమంత రాజ్ పక్కనే నిల్చొని ఫోటో దిగింది. మరో ఫొటోలో ఫ్లైట్ లో రాజ్ భుజంపై తలవాల్చి క్లోజ్ గా సెల్ఫీ తీసుకుంది. మరో ఫొటోలో శుభం షూటింగ్ లో సమంతకు రాజ్ సీన్ వివరిస్తున్నాడు. ఇలా రాజ్ తో ఉన్న ఫొటోలు ఎక్కువ షేర్ చేయడంతో మారోసారి సమంత – రాజ్ ప్రేమ వార్తలు వైరల్ గా మారాయి.

అయితే రాజ్ కి ఇప్పటికే పెళ్లి అయింది. రాజ్ అధికారికంగా విడాకులు తీసుకున్నట్టు వార్తలు లేవు. సమంత చైతూతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంత – రాజ్ ఇలా తిరగడం, వీరి పై వార్తలు వచ్చినా సమంత – రాజ్ స్పందించకపోవడంతో వీరిద్దరూ నిజంగానే డేటింగ్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు అంతా. సమంత పోస్ట్ కింద కూడా అన్ని రాజ్ గురించే కామెంట్స్ ఉండటం గమనార్హం. సమంత డైరెక్ట్ గా చెప్పకుండా ఇన్నిసార్లు వీరిద్దరి ఫొటోలు షేర్ చేసి ఇలా హింట్స్ ఇస్తుందా అని కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు.

Also Read : Prabhudeva : ప్రభుదేవా తమిళ్ సూపర్ హిట్ కామెడీ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలోనో తెలుసా?