Prabhudeva : ప్రభుదేవా తమిళ్ సూపర్ హిట్ కామెడీ సినిమా.. ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలోనో తెలుసా?
ప్రభుదేవా గత సంవత్సరం జాలీ ఓ జింఖానా అనే కామెడీ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నవ్వించాడు.

Prabhudeva Comedy Film Jolly O Gymkhana streaming in Telugu
Prabhudeva : డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవావా హీరోగా కూడా సినిమాలు చేస్తూ సక్సెస్ లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రభుదేవా గత సంవత్సరం జాలీ ఓ జింఖానా అనే కామెడీ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నవ్వించాడు. ఆ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ అయి రిలీజయింది.
ప్రభుదేవా జాలీ ఓ జింఖానా సినిమా నేటి నుంచి ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. భవాని మీడియా ద్వారా నేడు మే 15 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ కామెడీ సినిమా చూసి నవ్వుకోండి.
జాలీ ఓ జింఖానా సినిమాలో ప్రభుదేవా హీరోగా చేయగా మడోన్నా సెబాస్టియన్, అభిరామి, యోగిబాబు, రెడిన్ కింగ్స్‌లీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యషికా ఆనంద్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. శక్తి చిదంబరం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.