Nani – Sudeep : కిచ్చ సుదీప్ కూతురు శాన్వి.. నాని హిట్ 3 సినిమాకు పనిచేసిందని తెలుసా? సుదీప్ – నాని ఇంత క్లోజా?
కిచ్చ సుదీప్ కూతురు శాన్వి హిట్ 3 సినిమాకు ఓ విభాగంలో కూడా పనిచేసింది.

Do You Know Kannada Star Kichcha Sudeep Daughter Sanvi Worked for Nani Hit 3 Movie
Nani – Sudeep : నాని ఇటీవలే హిట్ 3 సినిమాతో వచ్చి భారీ సక్సెస్ కొట్టాడు. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి నాని కెరీర్లో మరో పెద్ద హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ కూతురు శాన్వి ఓ విభాగంలో కూడా పనిచేసింది. సినీ పరిశ్రమలోని స్టార్స్ పిల్లలు కూడా చాలా మంది సినీ పరిశ్రమలోకి వస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగులో ఈగ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ కన్నడలో స్టార్ హీరో. సుదీప్ కూతురు శాన్వి సింగర్ గా దూసుకుపోతుంది. శాన్వి ఇప్పటికే కన్నడలో పలు సినిమాలకు పాటలు పాడింది, కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. అయితే ఇటీవల హిట్ 3 సినిమాలో ట్రైలర్ చివర్లో వచ్చే మ్యూజిక్ కి హమ్మింగ్ పాడింది. అలాగే హిట్ 3 సినిమాలో ఓ సాంగ్ కి కూడా శాన్వి బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హమ్మింగ్ పాడింది. హిట్ 3 ప్రమోషన్స్ లో భాగంగా నాని కన్నడలో ఇంటర్వ్యూలు ఇవ్వగా ఈ విషయాన్ని తెలిపాడు.
Also Read : Tollywood Young Directors : యువ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. టాలీవుడ్ భవిష్యత్తు వీళ్లదే.. ఫొటో వైరల్..
అలాగే.. సుదీప్ అన్న నాకు ఫ్యామిలీ లాంటి వాడు. సుదీపన్న వైఫ్ ప్రియా, కూతురు శాన్వి కూడా క్లోజ్. వాళ్ళని ఎప్పుడు కలిసినా శాన్విని ఒక పాట పాడమని అడుగుతాను. శాన్వి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం అని తెలిపాడు నాని. ఈగ సినిమాలో నాని – సుదీప్ కలిసి పనిచేసారు. అప్పట్నుంచి వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది. శాన్వి గతంలో నాని – తన తండ్రి సుదీప్ తో ఈగ సమయంలో, ప్రస్తుతం దిగిన ఫోటోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే తను హమ్మింగ్ ఇచ్చిన హిట్ 3 పాటని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : Renu Desai – Aadya : కూతురు ఆద్యతో రేణు దేశాయ్ క్యూట్ ఫొటోలు..