Tollywood Young Directors : యువ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. టాలీవుడ్ భవిష్యత్తు వీళ్లదే.. ఫొటో వైరల్..
తాజాగా టాలీవుడ్ లో చాలా మంది యువ దర్శకులు ఒకే ఫొటోలో కనిపించి వైరల్ అవుతున్నారు.

Tollywood Young Directors Group Photo goes Viral
Tollywood Young Directors : ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది కొత్త కొత్త దర్శకులు వచ్చి మంచి సినిమాలతో సక్సెస్ లు సాధిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త కథలను అందిస్తూ హిట్స్ కొడుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో చాలా మంది యువ దర్శకులు ఒకే ఫొటోలో కనిపించి వైరల్ అవుతున్నారు. హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కొలను, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ ఈ యువ డైరెక్టర్స్ గ్రూప్ ఫోటోని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ గ్రూప్ ఫొటోలో.. శైలేష్ కొలను, సాయి రాజేష్, రాహుల్ సాంకృత్యాన్, వివేక్ ఆత్రేయ, సాగర్ చంద్ర, బుచ్చిబాబు సాన, శివ నిర్వాణ, అనుదీప్, సాధినేని పవన్, భరత్ కమ్మ, శ్రీరామ్ ఆదిత్య, చందూ మొండేటి, సందీప్ రాజ్, హషిత్ గోలి, వెంకీ కుడుముల, వశిష్ఠ, స్వరూప్, ఫణి ప్రదీప్, వినోద్.. ఇంతమంది దర్శకులు ఉన్నారు. వీళ్లంతా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన వారే.
తాజాగా శైలేష్ కొలను హిట్ 3 సక్సెస్ అవ్వడంతో వీరంతా స్పెషల్ పార్టీ చేసుకున్నట్టు సమాచారం. ఆ పార్టీలోనే ఈ గ్రూప్ ఫోటో దిగి పోస్ట్ చేశారు. ఇంతమంది యువ దర్శకులు ఒకే ఫొటోలో ఉండటంతో టాలీవుడ్ భవిష్యత్తు అంతా వీళ్ళ చేతుల్లోనే ఉంది కదా అని కామెంట్స్ చేస్తున్నారు సినిమా లవర్స్.
అయితే వీళ్లంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నట్టు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోడానికి, అందరూ ఒక ఫ్యామిలీలా ఉండటానికి అన్నట్టు డైరెక్టర్ సాయి రాజేష్ తెలిపాడు. శైలేష్ కొలను.. మేమంతా చాలా రోజుల నుంచి కలవాలని అనుకుంటున్నాము. నా హిట్ 3 సక్సెస్ వీరందరితో పంచుకుంటున్నాను అని తెలిపాడు.