Eesha Rebba gave clarity on dating rumors with Tharun Bhascker.
Eesha Rebba: టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. అంతకుముందు ఆతరువాత సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత కూడా పలు సినిమాలు చేసింది. చాలా గ్యాప్ తరువాత ఈ అమ్మడు ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిః’. దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇది మలయాళ సూపర్ హిట్ సినిమా ‘జయ జయ జయహే’ సినిమాకు రీమేక్.
టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది ఈషా(Eesha Rebba). అయితే, ఈ సినిమా ఎంత ప్రమోషన్ అవుతుందో తెలియదు కానీ, ఈ అమ్మడు డేటింగ్ రూమర్స్ మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఈషా దర్శకుడు తరుణ్ భాస్కర్ తో డేటింగ్ లో ఉంటుందని, త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Chinmayi: ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు.. చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి
ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఈమధ్య చాలా సందర్భాల్లో ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఈషా దగ్గర ప్రస్తావించారు ఒక యాంకర్. ఓం శాంతి శాంతి శాంతిః మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో భాగంగా తరుణ్ భాస్కర్ తో డేటింగ్ వార్తల గురించి అడిగారు. దానికి సమాధానంగా ఈషా మాట్లాడుతూ..’ఎదో ఒక రకంగా వార్తల్లో వైరల్ అవడం సంతోషమే. కానీ, వచ్చిన ప్రతీ వార్తకు మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు.
ఏదైనా ఉంటే స్వయంగా నేనే మీతో పంచుకుంటాను. ప్రస్తుతం నేను ఒకరితో డేటింగ్ లో ఉన్నాను. కానీ, అది ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది” అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఆమె ఎవరితో డేటింగ్ లో ఉంది అనే విషయం మాత్రం రివీల్ చేయలేదు. కానీ, గత కొంతకాలంగా ఈషా- తరుణ్ భాస్కర్ రిలేషన్ గురించి వస్తున్న న్యూస్ కి చెక్ పడింది.