Chinmayi: ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు.. చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి

మెగాస్టార్ చిరంజీవి చేసిన కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై సుదీర్ఘమైన పోస్ట్ పెట్టిన సింగర్ చిన్మయి(Chinmayi).

Chinmayi: ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు.. చిరంజీవికి కౌంటర్ ఇచ్చిన సింగర్ చిన్మయి

Chinmayi counter response to Chiranjeevi comments on the casting couch.

Updated On : January 27, 2026 / 9:26 AM IST
  • చిరంజీవి గారి తరం వేరు అన్న చిన్మయి
  • ఇక్కడ అవకాశం కోసం శరీరం అప్పగించాల్సిందే అంటూ వ్యాఖ్య
  • సెక్స్ కోరుకునే మగవారితోనే అసలు సమస్య అంటూ కామెంట్స్

Chinmayi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది అని, మనం ఏం ఇస్తే అదే తిరిగి ఇస్తుందని, అందుకే అక్కడ అవకాశాల కోసం వేరే దారులు తొక్కాల్సిన అవసరం లేదని, మనం నిబ్బద్దతగా ఉండాలని చెప్పుకొచ్చాడు. అయితే, తాజాగా మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ పై సింగర్ చిన్మయి(Chinmayi) కౌంటర్ ఇచ్చింది. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

“ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ అనే పదానికి అర్థం వేరు. శరీరాన్ని అప్పగించకపోతే మహిళలకు ఇక్కడ అవకాశాలు రావు. మహిళల నుంచి లైంగిక ప్రయోజనాలను ఆశించడం అనేది మగవారికి సర్వసాధారణంగా మారిపోయింది. చిరంజీవి గారి తరం వేరు. అప్పుడు గౌరవప్రదమైన సంబంధాలు ఉండేది. ఇప్పుడు దారుణంగా మారిపోయాయి.

Harish- Anil: తమ్ముడు అనీల్.. కారులో తొందరగా రా.. పవన్ పాటను గిఫ్టుగా ఇచ్చేస్తా!

ఒక ఫిమేల్ మ్యూజిషియన్‌ను స్టూడియోలో లైగికంగా వేదించానికి ప్రయత్నిస్తే ఆమె సౌండ్ బూత్‌లో తనను తాను లాక్ చేసుకుంది. వేరే వాళ్ళు వచ్చే వరకు ఆమె అక్కడే ఉంది. తరువాత ఆమె ఈ రంగాన్నే వదిలేసింది. ఒక మేల్ సింగర్ తన పురుషాంగం ఫోటోలు పంపి లైంగిక కోరికలు తీర్చాలని వేదిస్తాడు. అలాంటి వాళ్లకే ఈ సమాజం రెడ్ కార్పెట్ వేస్తుంది. నేను కూడా ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నాను. గీత రచయిత వైరాముత్తు నా తల్లి ముందే నన్ను లైంగికంగా వేధించాడు.

ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇది అర్థం చేసుకోకుండా సీనియర్ నటి షావుకారు జానకి లాంటివారు కూడా బాధితులను తప్పుబడుతున్నారు. ఇండస్ట్రీ ఎప్పటికీ అద్దం లాంటిది కాదు. ఇక్కడ అవకాశాలుఇవ్వాలంటే సెక్స్ కోరుకునే పురుషులే పెద్ద సమస్య” అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది చిన్మయి. దీంతో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.