Election Commission Notices to Jabardasth Rakesh for KCR Movie
Jabardasth Rakesh : జబర్దస్త్(Jabardasth) రాకింగ్ రాకేష్ అందరికి పరిచయమే. మెజీషియన్, మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రాకేష్ ఆ తర్వాత జబర్దస్త్ లో చాలా కాలం పాటు రాకింగ్ రాకేష్ గా స్కిట్స్ తో మెప్పించి కొన్నాళ్ల క్రితమే బయటకి వచ్చేశాడు. పలు సినిమాల్లో కమెడియన్ గా కూడా నటించాడు. రాకేష్ ఇటీవల నిర్మాతగా, మెయిన్ లీడ్ లో ఓ సినిమా చేశాడు.
గరుడవేగ అంజి(Garudavega Anji) దర్శకత్వంలో రాకేష్ మెయిన్ లీడ్ గా ‘KCR (కేశవ్ చంద్ర రమావత్)’ అనే సినిమాని ప్రకటించారు. ఓ పోస్టర్ కూడా రిలిజ్ చేయగా ఇది అచ్చు తెలంగాణ సీఎం KCR లాగే ఉండటంతో వైరల్ గా మారింది. ఎలక్షన్స్ టైంలో ఈ సినిమాని ప్రకటించడంతో మరింత వైరల్ అయింది. ఈ పోస్టర్ లాంచ్ ని మినిష్టర్ మల్లారెడ్డి చేయడం విశేషం.
రాకేష్ ఈ సినిమాని తెలంగాణ ఎలక్షన్స్ ముందే నవంబర్ చివర్లో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ కూడా రెడీ అయి, సెన్సార్ కూడా అయిపోయింది. అయితే తాజాగా రాకింగ్ రాకేష్ కి ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. రాకేష్ తెరకెక్కించిన KCR సినిమాని ఎలక్షన్స్ అయ్యేదాకా రిలీజ్ చేయొద్దని నోటీసులు పంపించింది. సినిమాకి KCR అని పేరు పెట్టడం, పాలిటిక్స్ మీదే సినిమా ఉందని తెలియడంతో ఎలక్షన్ కమీషన్ రాకేష్ కి సినిమా రిలీజ్ వాయిదా వేసుకోవాలని నోటీసులు ఇచ్చింది.
ఇటీవల రాకేష్ తన సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి ఈ విషయాన్ని తెలిపాడు. ఎంతో కష్టపడి తీసిన సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఇలాంటి సినిమాలను ఎన్నికల ముందు రిలీజ్ చేయకూడదని, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఎలక్షన్స్ అయ్యాకే రిలీజ్ చేసుకొమ్మని ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించినట్టు తెలిపాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని అన్నాడు.
Also Read : NTR : వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆ హీరోయిన్ నటిస్తుందా?
రాకేష్ ఈ సినిమా కోసం తన ఇల్లు తాకట్టు పెట్టి మరీ నిర్మాతగా మారినట్టు, రాకేష్ భార్య సుజాత కూడా తనకు దాచుకున్న డబ్బుని ఈ సినిమా గురించి ఇచ్చిందని, ఈ సినిమా మీదే తన జీవితం ఆధారపడి ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు రాకేష్. ఇప్పుడు మళ్ళీ సినిమా వాయిదా పడటంతో రాకేష్ పరిస్థితి పాపం అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే చక్కగా సినిమాలు, జబర్దస్త్ చేసుకుంటూ సంపాదించుకుంటుంటే మధ్యలో ఇలా నిర్మాతగా డబ్బులు పెట్టడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి రాకేష్ ‘KCR’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఎన్నికలయ్యాక కొత్త డేట్ ప్రకటిస్తానని రాకేష్ తెలిపాడు.