Emmanuel made emotional comments about his bigg boss journey
Emmanuel: తన బిగ్ బాస్ ప్రయాణంపై కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. తనకు బిగ్ బాస్ ఎంతో ఇచ్చాడని, లక్షల మంది ప్రేమ నాకు దొరికింది అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ అనంతరం ఇమ్మాన్యుయేల్(Emmanuel) మీడియాతో మాట్లాడాడు.. “ఈ బిగ్ బాస్ అనుభవాన్ని నేను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటానని, సహ పార్టిసిపెంట్స్, మరీ ముఖ్యంగా సంజనాతో ఏర్పడిన స్పెషల్ అనుబంధం జీవితాంతం ఉంటుందని” ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.
Anasuya Bharadwaj: కసి చూపులతో కవ్విస్తున్న అనసూయ.. ఫోటోలు
బిగ్ బాస్ అంటే చాలా మంది నటన అనుకుంటారు. కానీ వారాల తరబడి, రోజుల తరబడి, గంటల తరబడి నటించే మహానటులు ఈ ప్రపంచంలో ఉండరు. ఈ బిగ్ బాస్ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా “విజనరీ వౌస్” కి నా కృతజ్ఞతలు. ఈ బిగ్ బాస్ నుంచి నేర్చుకున్న ఎన్నో విలువైన విషయాలను నా కెరీర్ లో, జీవితంలో అనుసరించే ప్రయత్నం చేస్తాను. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్ కు నా శుభాకాంక్షలు. అలాగే, నాకు మొదటి స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఏమాత్రం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఇమ్మాన్యుయేల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.