ENE Repeat Trailer : ఈ నగరానికి ఏమైంది 2 ట్రైలర్ వచ్చేసింది.. విజయ్ దేవరకొండ వాయిస్ తో..

మీరు కూడాENE రిపీట్ ట్రైలర్ చూసేయండి..

  • Updated on- November 3, 2026 / 05:08 PM IST

ENE Repeat Trailer

ENE Repeat Trailer : 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ నగరానికి ఏమైంది చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం సాధించి యూత్ కి బాగా కనెక్ట్ అయి క్లాసిక్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ సినిమాకు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసారు. ENE రిపీట్ అనే టైటిల్ తో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 సినిమా రానుంది. నవంబర్ 19న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

విశ్వక్ సేన్, సాయినాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మెయిన్ లీడ్స్ లో అనిషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, ప్రియదర్శిని రామ్, కరుణకుమార్.. పలువురు కీలక పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. పార్ట్ 1 గోవా బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఈ సినిమా బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ లో తీసినట్టు తెలుస్తుంది. తాజాగా ENE రిపీట్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also Read : Rajamouli : సుకుమార్ – చరణ్ సినిమాపై రాజమౌళి కామెంట్స్.. ఓపెనింగ్ సీన్ హార్డ్ హిట్టింగ్ అంటూ..

ఈ నగరానికి ఏమైంది సినిమాలో చివర్లో విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండతో షార్ట్ ఫిలిం తీస్తున్నట్టు చూపించారు. ఈ ట్రైలర్ అక్కడే ఓపెనింగ్ అయినట్టు విజయ్ దేవరకొండ వాయిస్ తో ఓపెన్ చేసారు. విశ్వక్ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఈ నలుగురు ఫ్రెండ్స్ బ్యాంకాక్ వెళ్లి అక్కడ పడ్డ ఇబ్బందులు, మధ్యలో కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడాENE రిపీట్ ట్రైలర్ చూసేయండి..