రామ్ ‘రెడ్’ – ప్రారంభం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రెడ్’.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘రెడ్’.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల తర్వాత, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ, ‘రెడ్’.. తమిళ్ బ్లాక్ బస్టర్ ‘తడమ్’ తెలుగు రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ చేయనున్నాడు. రామ్ 18వ సినిమా ఇది..
మాళవిక శర్మ, నివేదా పేతురాజ్ హీరోయిన్స్.. రీసెంట్‌గా ‘రెడ్’ అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్, ఛార్మీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రామ్‌పై పూరీ, ఛార్మీ కలిసి క్లాప్ నివ్వగా, జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Read Also : AA 20 : అల్లు-సుకుమార్ మూవీకి కొబ్బరికాయ కొట్టారు..
నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. రామ్ హోమ్ బ్యానర్ ‘స్రవంతి మూవీస్’లో, కృష్ణ పోతినేని సమర్పణలో, స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం : ’మెలోడిబ్రహ్మ’ మణిశర్మ, కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : జునైద్, ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్.
Energetic Star @ramsayz much awaited #REDTheFilm begins today ?#GeminiKiran switched ON the Camera & 1st shot clapped by @purijagan & @Charmmeofficial
A #KishoreThirumala‘s Directorial!!#Red #SravanthiRaviKishore @SravanthiMovies #Manisharma @PeterHeinOffl pic.twitter.com/ea2GfsiTzu
— BARaju (@baraju_SuperHit) October 30, 2019