‘ఎంటర్ ద గర్ల్ డ్రాగన్’ మేకింగ్ వీడియో రిలీజ్

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎంటర్ ద గర్ల్ డ్రాగన్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (నవంబర్ 27, 2019)న ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. బ్రూస్‌లీ 80వ జయంతి సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను వర్మ విడుదల చేశారు.
అయితే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. రవిశంకర్ మ్యూజిక్ అందించగా.. ఇండో చైనీస్ కో ప్రొడక్షన్ మూవీని జింగ్ లీ, నరేశ్ టీ, శ్రీధర్ టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ రోజు (నవంబర్ 30, 2019)న ఈ సినిమాలో పూజా రఫ్పాడించిన సన్నివేశాలకి సంబంధించి మేకింగ్ వీడియో విడుదల చేశారు వర్మ. టీజర్‌లో మీరు చూసినవి డూప్ కాదు. పూజా భాలేకర్ భాలేకర్ బ్రూస్‌లీ స్టైల్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుందని వర్మ పేర్కొన్నారు. అంతేకాదు ఇది భారతదేశంలో నిర్మించిన తొలి మార్షల్ ఆర్ట్స్ చిత్రమని, తన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని, ఈ సినిమా అంతర్జాతీయ ట్రైలర్‌ను బ్రూస్ లీ సొంత పట్టణమైన చైనాలోని ఫోషన్ సిటీలో డిసెంబర్ 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు వర్మ.