‘ఎంత మంచివాడవురా’ షూటింగ్ పూర్తి – సంక్రాంతికి కలుద్దాం

‘ఎంత మంచివాడవురా’ షూటింగ్ పూర్తి.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15 విడుదల..

  • Published By: sekhar ,Published On : November 26, 2019 / 07:22 AM IST
‘ఎంత మంచివాడవురా’ షూటింగ్ పూర్తి – సంక్రాంతికి కలుద్దాం

Updated On : November 26, 2019 / 7:22 AM IST

‘ఎంత మంచివాడవురా’ షూటింగ్ పూర్తి.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15 విడుదల..

నందమూరి కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఎంత మంచివాడవురా’.. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో, ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది.

Image

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సంక్రాంతి కానుకగా 2020 జనవరి 15న ‘ఎంత మంచివాడవురా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు నిర్మాతలు.

Image

విజయ్ కుమార్, శరత్ బాబు, సుహాసిని, ప్రగతి, ప్రభు, వీకే నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం : గోపి సుందర్, కెమెరా : రాజ్ తోట, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : వెంకట్.
Image