Erra Cheera : సినిమా కథ గెస్ చేసి చెప్తే.. ఐదు లక్షలు ప్రైజ్ మనీ..

మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతునన్ ఎర్రచీర సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది.

Erra Cheera Movie Postponed Contest Details Here

Erra Cheera : సుమన్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఎర్రచీర – ది బిగినింగ్’. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు.. పలువురు కీలక పాత్రల్లో ఎర్రచీర సినిమా తెరకెక్కుతుంది.

మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతునన్ ఎర్రచీర సినిమా ఏప్రిల్ 25 రిలీజ్ అవ్వాల్సి ఉండగా పలు సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. ఈ సినిమాని మే రెండో వారంలో రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు. అలాగే ఓ కాంటెస్ట్ కూడా అనౌన్స్ చేసారు.

Also Read : Sodara : ‘సోదరా’ మూవీ రివ్యూ.. సంపూర్ణేష్ బాబు సినిమా ఎలా ఉందంటే..?

దర్శక నిర్మాత మాట్లాడుతూ.. ఈ నెల 25న రిలీజ్ అవ్వాల్సిన ఎర్రచీర సినిమా కొన్ని టెక్నికల్ కారణాలతో వాయిదా పడింది. మే నెలలో ఈ సినిమాను రిలీజ్ చేస్తాము. కామెడీ, హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ అన్నీ కలగలిపి ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఉంటుంది. సినిమా చూసి బయటకు వెళ్లే ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని వెళ్తారు. ఈ సినిమాకి ఒక కాంటెస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. సినిమా కథ కరెక్టుగా రిలీజ్ కి ముందు గెస్ చేస్తే ఐదు లక్షలు ప్రైజ్ మనీ ఇస్తాం. 8019246552 నంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేసి కరెక్ట్ కథ చెప్పినవారికి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐదు లక్షలు బహుమతి ఇస్తాము అని తెలిపారు.

Also Read : Gopi Sundar : ఆ ఏరియాల్లో పూజించే ‘కొరగజ్జ’ దేవతపై సినిమా.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే..