Gopi Sundar : ఆ ఏరియాల్లో పూజించే ‘కొరగజ్జ’ దేవతపై సినిమా.. మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నాడంటే..
డైరెక్టర్ సుధీర్ అత్తవర్‌తో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ పనిచేస్తున్నారు.

Music Director Gopi Sundar Comments on Koragajja Movie
Gopi Sundar : కబీర్ బేడి, సందీప్ సోపార్కర్, గణేష్ ఆచార్య, భవ్య, శ్రుతి.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా కొరగజ్జ. త్రివిక్రమ సినిమాస్, సక్సెస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కర్ణాటక, కేరళలోని కరావళి ప్రాంతంలో, ముంబైలోని కొన్ని ప్రదేశాలలో ఈ కొరగజ్జ దేవతను పూజిస్తారు. ఈ కథ అంతా కొరగజ్జ దేవత చుట్టే తిరుగుతుంది.
డైరెక్టర్ సుధీర్ అత్తవర్‌తో కలిసి ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ పనిచేస్తున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి తాను పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు.
Also Read : Sodara : ‘సోదరా’ మూవీ రివ్యూ.. సంపూర్ణేష్ బాబు సినిమా ఎలా ఉందంటే..?
మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంగీతం కంపోజ్ చేయడానికి చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాలు చేసాం. కొరగజ్జ చరిత్రను తెలుసుకున్నాం. అందుకే ఈ సినిమాకు కాస్త సమయం ఎక్కువ పట్టింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత ఈ ట్యూన్స్ చేశాను. కొరగజ్జ సినిమా కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ సినిమా నాకు సవాలుగా అనిపించింది అని తెలిపారు.
అలాగే.. ఈ సినిమాలో ఆరు పాటలు ఉంటాయి. వీటిని వివిధ శైలి, భాషల్లో స్వరపరిచాం. ఈ పాటలకు సుధీర్ అత్తవర్ స్వయంగా సాహిత్యం అందించారు. ఈ సినిమాలో సాంగ్స్ శ్రేయ ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, స్వరూప్ ఖాన్, అర్మాన్ మాలిక్.. పలువురు సింగర్స్ పడరాని తెలిపారు.
డైరెక్టర్ మాట్లాడుతూ.. కాంతార సినిమా కంటే ఇది ఎంతో భిన్నంగా ఉంటుంది. వేల దేవతలకు నిలయమైన కర్ణాటక, కేరళ సాంస్కృతిక వారసత్వంలో కాంతార ఒకరిని చూపించింది. ఈ సినిమాలో కొరగజ్జ దేవత చుట్టూ కథ చూపించబోతున్నాం. ఈ సినిమా పోనాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది అని తెలిపారు.