Sodara : ‘సోదరా’ మూవీ రివ్యూ.. సంపూర్ణేష్ బాబు సినిమా ఎలా ఉందంటే..?

సంపూర్ణేష్ బాబు అంటే కథ లేకపోయినా ఓ టిపికల్ కామెడీ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే సోదరా ప్రమోషన్స్ లో ఇది తన టైపు కామెడీ సినిమాలు కాదని ఓ కథ, ఎమోషన్ ఉంటుందని ప్రమోట్ చేసారు.

Sodara : ‘సోదరా’ మూవీ రివ్యూ.. సంపూర్ణేష్ బాబు సినిమా ఎలా ఉందంటే..?

Sampoornesh Babu Sanjosh Sodara Movie Review and Rating

Updated On : April 24, 2025 / 11:35 PM IST

Sodara Movie Review : సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్తా హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘సోదరా’. క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై చంద్ర చగన్లా నిర్మాణంలో మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సోదరా సినిమా నేడు ఏప్రిల్‌ 25న థియేటర్స్‌ లో విడుదల అయింది.

కథ విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరులో చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్) అన్నదమ్ములు. చిరంజీవి ఫ్యామిలీ సోడా బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. అన్నదమ్ములు ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. చిరంజీవి ఏజ్ పెరిగినా పెళ్లవ్వట్లేదని, వచ్చిన సంబంధాలన్నీ పోతున్నాయని బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో చిరంజీవి ఎదురింట్లో దివి(ఆర్తి గుప్తా) ఫ్యామిలీ వస్తుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడి ట్రై చేస్తూ ఉంటారు. తమ్ముడ్ని తప్పించాలని పవన్ ని వేరే ఊరుకి చదువుకోడానికి పంపిస్తాడు చిరంజీవి.

చిరంజీవి ప్రేమని దివి రిజెక్ట్ చేస్తుంది. కాలేజీలో పవన్ భువి(ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు. కాలేజీ సెలవుల్లో ఇంటికి వచ్చిన పవన్ కి తన అన్నయ్యని దివి రిజెక్ట్ చేసిందని తెలిసి అన్నయ్యని రెచ్చగొట్టి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్లేలా చేస్తాడు. దాంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ అయి దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళి చేసి వెళ్ళిపోతుంది. దీంతో చిరంజీవి తమ్ముడు పవన్ మీద కోపం తెచ్చుకుంటాడు. మరి చిరంజీవికి పెళ్లి అవుతుందా? దివి తిరిగొస్తుందా? పవన్ – భువి ప్రేమ ఏమైంది? అన్నదమ్ములు మళ్ళీ కలుస్తారా తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : Allu Arjun : ఫ్యామిలీతో కలిసి బంధువుల పెళ్ళికి హాజరయిన ఐకాన్ స్టార్.. ఫోటోలు, వీడియోలు వైరల్..

సినిమా విశ్లేషణ.. సంపూర్ణేష్ బాబు అంటే కథ లేకపోయినా ఓ టిపికల్ కామెడీ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే సోదరా ప్రమోషన్స్ లో ఇది తన టైపు కామెడీ సినిమాలు కాదని ఓ కథ, ఎమోషన్ ఉంటుందని ప్రమోట్ చేసారు. ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి, పవన్ గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి పవన్ కాలేజీలో లవ్ స్టోరీ, చిరంజీవి దివి వెనకపడటం చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కాలేజీ సీన్స్ అయితే బాగా సాగదీశారు. కాలేజీ సీన్స్, పవన్ లవ్ స్టోరీ ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది.

ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి పెంచుతారు. ఆ ట్విస్ట్ తో సినిమా కథ గాడిలో పడుతుంది. సెకండ్ హాఫ్ ఓ పక్క కామెడీ, మరో పక్క లవ్, బ్రదర్స్ ఎమోషన్ బాగానే వర్కౌట్ చేసారు. సెకండ్ హాఫ్ బాగానే నవ్వుకోవచ్చు. మళ్ళీ క్లైమాక్స్ లో ట్విస్ట్ లు ఇచ్చి ఆసక్తిగా ముగించారు. సినిమా అంతా పూర్తి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కాస్త రియలిస్టిక్ గా తీయడానికి ప్రయత్నించారు. కామెడీ బాగానే వర్కౌట్ అయినా అన్నదమ్ముల ఎమోషన్ ఇంకాస్త పండితే బాగుండేది.

sodara

నటీనటుల పర్ఫార్మెన్స్.. సంపూర్ణేష్ బాబు తన టైపు కామెడీ కాకుండా రెగ్యులర్ పాత్రలో నటించడానికి ప్రయత్నించినా అక్కడక్కడా తన సినిమాల ప్రభావం కనిపిస్తుంది. సంజోష్ పక్కా తెలంగాణ కుర్రాడిగా బాగానే సెట్ అయ్యాడు. ఆర్తి గుప్తా పద్దతిగా చీరల్లో కనిపించి మెప్పించింది. ప్రాచీ బన్సాల్ క్యూట్ గా, పద్దతిగా కనిపించి నటనతో కూడా బాగానే మెప్పించింది. బాబు మోహన్ చాన్నాళ్ల తర్వాత కామెడీ పాత్రలో కాసేపు అలరించారు. గెటప్ శ్రీను అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. బాబా భాస్కర్ పాత్ర లేకపోయినా ఉన్నా ఒకటే. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Nani – Chiranjeevi : నానికి సైకిల్ ఇచ్చిన చిరంజీవి.. ఇంటికెళ్తే బజ్జిలు వేయించి.. నాని మెగాస్టార్ ని షర్ట్ మార్చుకోమని చెప్తే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. సినిమా అంతా పల్లెటూరు లొకేషన్స్ బాగానే చూపించారు. డబ్బింగ్ ఇంకాస్త బెటర్ గా చెప్పిస్తే బాగుండేది. కొంతమందికి ఆ డబ్బింగ్, తెలంగాణ స్లాంగ్ వర్కౌట్ అవ్వలేదు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తగ్గిస్తే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. డైరెక్టర్ మొదటి సినిమా అయినా బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘సోదరా’ సినిమా అన్నదమ్ముల అనుబంధంతో ఓ ఆసక్తికర కథతో తెలంగాణ విలేజ్ బ్యాక్ ట్రాప్ లో కామెడీ ఎమోషనల్ కథాంశంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.