Esther's interesting post on second marriage
Ester Noronha: టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ నోరోన్హా రెండో పెళ్లి చేసుకోబోతుందా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. క్రైస్తవ మహిళలు వివాహ సమయంలో ధరించే తెల్ల రంగు గౌను ధరించి ఈ ఫొటోలో కనిపించింది. ఈ ఫోటోకి “జీవితంలో మరో అందమైన సంవత్సరాన్ని, అవకాశాలను, అద్భుతాలను అందించినందుకు దేవుడికి కృతజ్ఞతలు. ఈ పుట్టినరోజున నాపై ప్రేమను, ఆశీర్వాదాలను అందిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీతో ఓ స్పెషల్ ప్రకటన చేయాలనుకుంటున్నాను. దాని గురించి త్వరలోనే తెలియజేస్తాను” అనే క్యాప్షన్ ను(Ester Noronha) జత చేసింది.
Balakrishna-Gopichand: చారిత్రక కథ, యాక్షన్ బ్యాక్డ్రాప్.. బాలయ్య సరికొత్త అవతార్.. దసరాకి స్టార్ట్?
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఎస్తర్ రెండో పెళ్లి చేసుకోబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆమె కొత్త జీవితం కోసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఎస్తేర్ నోరోన్హా విషయానికి వస్తే, సునీల్ హీరోగా వచ్చిన ‘భీమవరం బుల్లోడు’ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తమిళ, మలయాళ, కన్నడ, కొంకణి, హిందీ భాషల్లో నటించి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తరువాత సినిమా అవాకాశాలు తగ్గిపోవడంతో సింగర్ నోయెల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ, పెళ్లైన కొద్ది రోజులకే ఈ ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఇక విడాకుల అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన ఎస్తర్.. పలు సినిమాల్లో రొమాంటిక్, బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయింది. ఇప్పుడు మరోపెళ్లికి చేసుకోవడానికి రెడీ అయ్యింది. మరి ఆమె పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది.