Balakrishna-Gopichand: చారిత్రక కథ, యాక్షన్ బ్యాక్డ్రాప్.. బాలయ్య సరికొత్త అవతార్.. దసరాకి స్టార్ట్?

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్(Balakrishna-Gopichand) లో ఉన్నారు. ఇప్పటికే ఈ ఇయర్ డాకు మహారాజ్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ 2: తాండవం సినిమా చేస్తున్నాడు.

Balakrishna-Gopichand: చారిత్రక కథ, యాక్షన్ బ్యాక్డ్రాప్.. బాలయ్య సరికొత్త అవతార్.. దసరాకి స్టార్ట్?

Balakrishna-Gopichand Malineni movie to start on Dussehra

Updated On : September 13, 2025 / 10:42 AM IST

Balakrishna-Gopichand: నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ ఇయర్ డాకు మహారాజ్ సినిమాతో హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ 2: తాండవం సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, అఖండ 2 తరువాత బాలకృష్ణ మరోసారి దర్శకుడు గోపిచంద్ మలినేని(Balakrishna-Gopichand)తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

Bigg Boss 9 Telugu: ఎలిమినేట్ అవుతుంది అన్నారు.. ఫస్ట్ కెప్టెన్ అయ్యింది.. పాపం కంటెస్టెంట్స్ కి ఇక చుక్కలే!

దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి అనే ఫ్యాక్షన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం బాలయ్య-గోపిచంద్ మూవీ దసరా కానుకగా మొదలుపెట్టనున్నారట. రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్న వ్రిద్ది సినిమాస్ నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం చారిత్రిక కథకు యాక్షన్ అంశాలను మేళవించి పవర్ ప్యాకుడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట దర్శకుడు గోపిచంద్ మలినేని.

బాలకృష్ణ కూడా మునుపెన్నడూ కనిపించనంత సరికొత్తగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమాని దసరా కానుకగా మొదలుపెట్టి వచ్చే ఏడాది సమ్మర్ కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనిపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. మరి వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలకృష్ణ-గోపిచంద్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.