ET 20 : మోహన్‌బాబు సినీప్రయాణానికి 48 ఏళ్లు.. లీక్స్‌తో ‘గుంటూరు కారం’ సతమతం

ET 20 : మోహన్‌బాబు సినీప్రయాణానికి 48 ఏళ్లు.. లీక్స్‌తో ‘గుంటూరు కారం’ సతమతం

ET 20 Latest Entertainment News Today On 22 November

‘డంకీ’ ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న చిత్రం డంకీ. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి రాజ్ కుమార్ హిరానీ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం నుంచి లుట్ పుట్ గయా అనే ఫస్ట్ సాంగ్ ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ మూవీ డిసెంబర్ 21న ఓవర్సీస్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.

‘సలార్‌’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌..

ప్రభాస్ న‌టిస్తున్న సినిమా స‌లార్‌. ఈ మూవీ ప్రోమో డిసెంబర్‌ ఒకటి సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సలార్‌ చిత్రం డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

‘దళారి’ సాంగ్‌ రిలీజ్‌..

అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు “దళారి” మూవీ రాబోతుందని మూవీ మేకర్స్ తెలియ‌జేశారు. ఈ మూవీకి సంబంధించి ఇవాళ “అన్నదమ్ములను” అనే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. అన్నదమ్ముల మధ్య మంచి ఎమోషనల్‌ సన్నివేశాలతో పాటు, రాజకీయ నాయకులు, దళారిలు, బినామీల మధ్యలో జరుగుతున్న కొత్త అంశాలను జోడిస్తూ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకొని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మూవీ మేకర్స్‌ చెప్పారు.

‘పర్‌ఫ్యూమ్’ టైటిల్ సాంగ్ రిలీజ్‌..

స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెఫ్ట్‌తో రూపొందుతోన్న మూవీ “పర్‌ఫ్యూమ్‌” మూవీ టైటిల్‌ సాంగ్ ఈ రోజు విడులైంది. తొలిసారిగా ఇలాంటి కాన్సెఫ్ట్‌తో మూవీ చేస్తున్నామని.. దీనికి ప్రేక్షకుల నుంచి చక్కని ఆదరణ లభిస్తుందని మూవీ యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తుంది. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన ఈ మూవీని జే.డి.స్వామి తెరకెక్కించారు. ఈనెల 24న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధ‌మైంది.

25న బ్రీత్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌..

ఈనెల 25న సాయంత్రం 6గంటలకు “బ్రీత్‌” మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగనుంది. హైదరాబాద్‌ దస్‌పల్లా హోటల్లో జరిగే ఈ ఈవెంట్‌కు నందమూరి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. నందమూరి చైతన్యకృష్ణ హీరోగా బసవతారకరామ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన ఈ మూవీని డైరెక్టర్‌ వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించారు. డిసెంబరు 2న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది.

ప్లాంట్‌ మ్యాన్‌’ టీజర్‌ రిలీజ్‌..

ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ మూవీ “ప్లాంట్‌ మ్యాన్‌” టీజర్‌ రిలీజైంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, లిరికల్‌ సాంగ్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. చంద్రశేఖర్‌, సోనాలి పాణిగ్రాహి, అశోక్‌ వర్థన్‌, యాదం రాజు తదితరులు ఈ మూవీలో నటిస్తున్నారు.

‘బబుల్‌గమ్‌’ ఇజ్జత్‌ సాంగ్‌ ప్రోమో రిలీజ్‌

“బబుల్‌గమ్‌” మూవీలోని ఇజ్జత్‌ సాంగ్‌ ప్రోమో రిలీజైంది. ఈ సాంగ్‌ ఫుల్‌ వీడియో రేపు ఉదయం 11గంటల 7 నిమిషాలకు మెగాస్టార్‌ చిరంజీవి లాంఛ్‌ చేయనున్నారు. యాంకర్‌ సుమ కొడుకు రోషన్‌ కనకాల ఈ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నారు. రోషన్‌కు జతగా మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. వచ్చేనె 29న “బబుల్‌ గమ్‌” మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇప్పటికే మూవీ యూనిట్‌ సినీ ప్రమోషన్స్‌కు ప్రారంభించింది.

మోహన్‌బాబు సినీప్రయాణానికి 48 ఏళ్లు పూర్తి..

విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌, నట ప్రపూర్ణ మోహన్‌ బాబు నేటితో సినీ రంగంలోకి వచ్చి 48 ఏళ్లు పూర్తయింది. తన కేరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి చెరగని ముద్రను వేశారు. ఎన్నో అవార్డులను అందుకున్న మోహన్‌ బాబు తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను చూశారు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించడమే కాకుండా మోహన్ బాబుని విలక్షణ నటుడిగా నిలబెట్టేశాయి.

కన్నప్ప నుంచి రేపు బిగ్‌ అప్‌డేట్‌..

మంచు విష్ణు హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజక్ట్ కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా రేపు ఈ మూవీ నుంచి ఎగ్జైటింగ్ అప్‌ డేట్ అందించనున్నట్లు మేకర్స్ తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీకి స్టీఫెన్ దేవస్సీ, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

లీక్స్‌తో ‘గుంటూరు కారం’ సతమతం..

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ మూవీ గుంటూరు కారం సినిమాకు లీక్స్‌ కష్టాలు ఎదురవతున్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దమ్ మసాల సాంగ్‌ వీడియో షూట్ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ తాజాగా సోషల్ మీడియాలో లీకైంది. దీంతో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

అలరిస్తున్న సైంధవ్‌ పాట..

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్. ఈ మూవీ నుంచి రిలీజైన రాంగ్ యూసేజ్ ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తోంది. యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. ఈ డ్యాన్సింగ్ నంబర్‌ను నకాశ్‌ అజీజ్ అద్భుతంగా పాడారు. సైంధవ్ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న పలు భాషల ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

‘పుష్ప2’పై దేవిశ్రీ ప్రసాద్‌ అప్‌డేట్‌..

సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ పుష్ప 2 గురించి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. పుష్ప సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని తెలిపారు. జాతర నేపథ్యంలో వచ్చే సన్నివేశంలో అల్లు అర్జున్‌ గంగమ్మ తల్లిగా కనిపించడం సినిమాకే లెట్‌గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుందని, ఇంటర్వెల్‌ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోతుందని తెలిపారు.

థ్యాంక్యూ చరణ్..

ఆదికేశవ ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రామ్ చరణ్ చేసిన పోస్టుకు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ స్పందించారు. హీరో రామ్ చరణ్ ప్రశంసలు ప్రైస్‌లెస్ అంటూ చెప్పుకొచ్చారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

రేపు నాగచైతన్య వెబ్‌సిరీస్‌ టీజర్‌ రిలీజ్‌..

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కెకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ సిరీస్ దూత. దీని ద్వారా తొలిసారిగా వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు నాగచైతన్య. ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ని నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా రేపు రిలీజ్‌ కానుంది. ఇక వెబ్‌ సిరీస్‌ డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రానుంది.

సుధీర్‌, రష్మీల మూవీ..?

సుడిగాలి సుధీర్‌, రష్మీ కాంబో అంటే ప్రేక్షకులకు పండుగే.. వీరిద్దరినీ బుల్లితెరపై చూసిన వాళ్లకు.. వెండితెరపై కూడా చూడాలని ఆశపడుతున్నారు. ఇదే విషయంపై కాలింగ్‌ సహస్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సుధీర్‌ స్పందించారు. రష్మీకి, తనకు సరిపోయే స్క్రిప్ట్స్ వింటున్నామని, మంచి కథ కుదిరితే తప్పకుండా త్వరలోనే కలిసి చేసే చిత్రంపై అనౌన్స్ మెంట్ అందిస్తామని చెప్పారు. దీంతో వీరిద్దరి కలయికలో త్వరలోనే సినిమా రాబోతుందని ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హనుమాన్‌ నుంచి మూడో సాంగ్..

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ సూపర్ హీరో మూవీ హనుమాన్. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తమ మూవీ నుంచి నవంబర్ 28న మూడో సాంగ్‌ రిలీజ్‌ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఓటీటీలోకి మార్టిన్‌ లూథర్‌కింగ్‌..

సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ పొలిటికల్ సెటైరికల్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. తాజాగా మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. నవంబర్ 29న సోనీ LIVలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.

కష్టమంతా మర్చిపోయా..

హన్సిక ప్రధాన పాత్రలో నటించి ఇటీవల థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి. ఈ సినిమా విజయాన్ని హన్సిక ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమాకు పడ్డ కష్టమంతా.. మూవీకి వచ్చిన సక్సెస్‌తో పటాపంచలైందని ఆనందం వ్యక్తం చేశారు హన్సిక. సినిమా సక్సెస్‌ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

అందుకే నటించలేదు..

అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మహాసముద్రంలో తాను నటించకపోవడానికి కారణమేంటో విశ్వక్ సేన్ తెలిపారు. మహాసముద్రం కథను అజయ్‌ తనకు వినిపించాడని, అయితే డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో నటించలేకపోయా అని తెలిపారు. మంగళవారం సినిమాలో హీరోయిన్‌ను హీరో స్థాయిలో చూపించాడని అజయ్‌పై విశ్వక్‌ ప్రశంసలు కురిపించారు.