ప్రభాస్ ను కొట్టలేదు.. జస్ట్ తాకింది అంతే..!

డార్లింగ్ ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ తో పాటు అభిమానులను బాహుబలి సినిమాతో తెచ్చుకున్న తెలుగు హీరో. ప్రభాస్ కు అమ్మాయిలలో ఉండే క్రేజ్ గురించి అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్ చేసిన హడావుడి వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. ప్రభాస్ కనిపించిన వెంటనే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ఓ అమ్మాయి ప్రభాస్ ని పట్టుకుని ఫోటో దిగడమే కాక బుగ్గపై కొట్టేసింది.
Also Read : కన్నడలో డబ్ అయిన రంగస్థలం
వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ‘సాహో’ సినిమా షూటింగ్ కోసం లాస్ ఏంజెల్స్ కి వెళ్లగా.. లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్ట్ లో ఓ యంగ్ లేడీ ఫ్యాన్ ప్రభాస్ వెంటబడి పోటో కోరింది. ఎగ్జైట్మెంట్ తో ఎగిరి గంతులేసిన ఆ యువతి ప్రభాస్ చెంప మీద తాకింది. అయితే వీడియోలో యువతి కొట్టినట్లు అనిపించడంతో వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ప్రభాస్ సైతం ఆ యువతి టచ్ చేసిన చోట బుగ్గ నిమురుకుంటూ సింపుల్ గా నవ్వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం సాహో అనే సినిమాను తీస్తున్న ప్రభాస్.. ఆ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
Also Read : షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. సినిమా ఆగిపోయిందట!