Express Hari – Ashu Reddy : అషురెడ్డి, ఎక్స్‌ప్రెస్ హరి ఇద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే. పలు టీవీ షోలలో వీరి ఫ్రెండ్షిప్ గురించి చెప్పారు. హరికి గతంలో అషు స్పెషల్ గా ఓ బైక్ కూడా కొనిచ్చింది. ప్రస్తుతం హరి, అషురెడ్డి ఇద్దరూ పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగానే ఉన్నారు. ఈ ఇద్దరూ కలిసి ఆహా కాకమ్మ కథలు షోకి వచ్చారు. వీరి ఎపిసోడ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేసారు.
గతంలో అషురెడ్డి ఆర్జీవీన ఇంటర్వ్యూ చేయగా ఆర్జీవీ అషురెడ్డి కాళ్ళను పట్టుకోవడం, అషురెడ్డి కాలి వేళ్ళను నోట్లో పెట్టుకోవడం చేసాడు. అప్పట్లో ఆ ఘటన బాగా వైరల్ గా మారి విమర్శలు కూడా వచ్చాయి. ప్రోమోలో సరదాగా దాన్ని రీ క్రియేట్ చేద్దామని ఎక్స్‌ప్రెస్ హరి అషురెడ్డి కాళ్ళను పట్టుకున్నాడు. తన కాలి వేళ్ళను నోట్లో పెట్టుకుందామని ట్రై చేస్తుండగా అషు కొట్టి వద్దని వారించింది.
Also Read : Priyanka Chopra : ఓ పక్క మహేష్ – రాజమౌళి షూటింగ్.. మరోపక్క బాబాయ్ మరణం..
అలాగే పుష్పలో ఆలు అర్జున్ రష్మిక కాలు పట్టుకొని తగ్గేదేలే డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ ని కూడా రీ క్రియేట్ చేసారు. ఎక్స్‌ప్రెస్ హరి అషురెడ్డి కాలు పట్టుకొని తగ్గేదేలే అంటూ గడ్డం దగ్గర పెట్టుకున్నాడు అషు కాలిని. దీంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది. మీరు కూడా అషురెడ్డి – ఎక్స్‌ప్రెస్ హరి సందడి చేసిన ఆహా కాకమ్మ కథలు ప్రోమో చూసేయండి..
https://www.youtube.com/watch?v=X_Be6yb1pdw
Also Read : Samyuktha : వామ్మో.. సైలెంట్ గా దూసుకుపోతున్న ‘సంయుక్త’.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?