Priyanka Chopra : ఓ పక్క మహేష్ – రాజమౌళి షూటింగ్.. మరోపక్క బాబాయ్ మరణం..
ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు - రాజమౌళి షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Priyanka Chopra Cousin Mannara Chopra Father Raman Rai Handa Passed Away
Priyanka Chopra : ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు – రాజమౌళి షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో వేసిన సెట్ లో షూటింగ్ జరుగుతుంది. అయితే తాజాగా ప్రియాంక చోప్రా బాబాయ్ చనిపోయారు. హీరోయిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా ఇటీవల జూన్ 16న మరణించారు. ప్రియాంక చోప్రా – మన్నారా చోప్రా కజిన్స్ అని తెలిసిందే. రామన్ రాయ్ ప్రియాంక చోప్రాకు బాబాయ్ అవుతారు.
హీరోయిన్ మన్నారా విదేశాల నుంచి రావడం లేట్ అవ్వడంతో రామన్ రాయ్ హండా అంత్యక్రియలు ముంబైలో నేడు మధ్యాహ్నం జరిగాయి. ప్రియాంక చోప్రా కూడా తన బాబాయ్ రామన్ రాయ్ హండాకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. త్వరలో ప్రియాంక మన్నారాని కలవనుందని సమాచారం.
Also Read : Samyuktha : వామ్మో.. సైలెంట్ గా దూసుకుపోతున్న ‘సంయుక్త’.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలుసా?
ప్రియాంక చోప్రా బాబాయ్, మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా ప్రముఖ న్యాయవాది. ఢిల్లీ హైకోర్టులో కూడా ఆయన పనిచేసారు. పలు ఆరోగ్య సమస్యలతో 71 ఏళ్ళ వయసులో మరణించారు.