F3 Locks Ott Streaming Date
F3: టాలీవుడ్‌లో ది మోస్ట్ వెయిటెడ్ కామెడీ ఫ్రాంచైజీగా వచ్చిన ఎఫ్3 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్2 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించగా, మరోసారి తనదైన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంలో ఈ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లు తమ కామెడీ టైమింగ్‌తో మరోసారి ఈ సినిమాను హిలేరియస్‌గా మార్చారు.
F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?
కాగా, డబ్బు చుట్టూ తిరిగే కథ అయినా, ప్రేక్షకులను కామెడీతో మెప్పించేలా ఎఫ్3ని మలచడంలో దర్శకుడు పనితనం బాగుండటంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడంతో బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. నిర్మాతకు మంచి వసూళ్లను రాబట్టింది ఈ కామెడీ మూవీ. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది.
Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. జూలై 22 నుంచి ఎఫ్3 చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ను ఇప్పుడు మీరు, మీ కుటుంబ సభ్యులు ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ పీర్జాదా, సోనాల్ చౌహాన్ హరీయిన్లుగా నటించగా, ఎఫ్2లో నటించిన మెజారిటీ నటీనటులు ఈ సీక్వెల్ చిత్రంలో కూడా కనిపించారు.
Triple the fun. Triple the funny. Triple the frustration ??
F3 is coming to Netflix on the 22nd of July in Telugu! pic.twitter.com/bxEbYMTkLl— Netflix India South (@Netflix_INSouth) July 12, 2022