F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఫ్రాంచైజ్ మూవీ ‘ఎఫ్3’ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో....

F3: ఎఫ్3 వరల్డ్‌వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?

F3 Worldwide Closing Collections

F3 Movie: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ ఫ్రాంచైజ్ మూవీ ‘ఎఫ్3’ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పీర్జాదా మరోసారి ఎఫ్2 మేనియాను తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నం చేశారు. అయితే ఆ రేంజ్‌లో ఈ సినిమాను సక్సెస్ చేయలేకపోయినా, ఈ చిత్రాన్ని మాత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలపడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది.

F3 Movie : 100 కోట్ల క్లబ్‌లోకి F3 సినిమా.. బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు..

ఇక ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు ఇతర నటీనటులు కూడా ప్రేక్షకులను కుడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో కామెడీని ఎలా వాడాలో.. కామెడీతో ఎలా హిట్ కొట్టాలో మరోసారి ప్రూవ్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమాను దర్శకుడు దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వసూళ్లను రాబట్టడంలో సక్సెస్ అయ్యింది. ఈ చిత్రం మే 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాగా, ఇప్పుడు ఈ సినిమా 50 రోజులవైపు పరుగులు పెడుతోంది. అయితే మార్కెట్ వర్గాల ప్రకారం ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ లెక్క తేలిపోయింది.

F3: ఎఫ్3 రెండు వారాల కలెక్షన్స్.. హాఫ్ సెంచరీ దాటేసిన సీక్వెల్!

ఈ సినిమా ఏపీ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.53.94 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.70.94 కోట్ల షేర్ వసూళ్లు సాధించింది. ఇక గ్రాస్ పరంగా ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.134 కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా సమ్మర్ కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా క్లోజింగ్ షేర్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 20.57 కోట్లు
ఉత్తరాంధ్ర – 7.48 కోట్లు
ఈస్ట్ – 4.18 కోట్లు
వెస్ట్ – 3.41 కోట్లు
కృష్ణా – 3.23 కోట్లు
గుంటూరు – 4.18 కోట్లు
నెల్లూరు – 2.31 కోట్లు
సీడెడ్ – 8.58 కోట్లు
ఏపీ+తెలంగాణ – రూ.53.94 కోట్లు
కర్ణాటక – 5 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 2 కోట్లు
ఓవర్సీస్ – 10 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.70.94 కోట్లు (గ్రాస్ రూ.134 కోట్లు)