F3: ఎఫ్3 రెండు వారాల కలెక్షన్స్.. హాఫ్ సెంచరీ దాటేసిన సీక్వెల్!

టాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజ్‌లుగా తెరకెక్కిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దాడు. ఇక రీసెంట్‌గా వచ్చిన...

F3: ఎఫ్3 రెండు వారాల కలెక్షన్స్.. హాఫ్ సెంచరీ దాటేసిన సీక్వెల్!

F3 Two Weeks Worldwide Collections

F3: టాలీవుడ్‌లో కామెడీ ఫ్రాంచైజ్‌లుగా తెరకెక్కిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలను దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దాడు. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘ఎఫ్3’ చిత్రం ప్రేక్షకులను కుడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ అండ్ గ్యాంగ్ చేసిన కామెడీ అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఇష్టపడ్డారు.

F3 Movie : 100 కోట్ల క్లబ్‌లోకి F3 సినిమా.. బ్యాక్ టు బ్యాక్ 100 కోట్ల సినిమాలు..

ఇక ఎఫ్2 సినిమా సక్సెస్‌ను ఎఫ్3 కూడా కంటిన్యూ చేసి అనిల్ రావిపూడి కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉన్నా, ప్యూర్ కామెడీతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు ఈ సినిమాను మలిచిన తీరు బాగుందని ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎక్కువ ఆసక్తిని కనబర్చడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

F3: ఎఫ్3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్‌బస్టర్!

ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు దాటేసరికి ప్రపంవచ్యాప్తంగా రూ.52.98 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టి తన సత్తా చాటింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఇక రెండు వారాలు ముగిసేసరికి ఎఫ్3 చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 17.75 కోట్లు
సీడెడ్ – 5.96 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.82 కోట్లు
ఈస్ట్ – 3.31 కోట్లు
వెస్ట్ – 2.41 కోట్లు
గుంటూరు – 3.20 కోట్లు
కృష్ణా – 2.81 కోట్లు
నెల్లూరు – 1.74 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.43 కోట్లు (రూ.69.25 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.94 కోట్లు
ఓవర్సీస్ – 7.04 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ – రూ.52.98 కోట్లు (రూ.88.80 కోట్లు గ్రాస్)