F3: ఎఫ్3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్‌బస్టర్!

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన ఎఫ్2 సినిమా గతంలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్....

F3: ఎఫ్3 ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్‌బస్టర్!

F3 Movie First Week Collections

F3: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి నటించిన ఎఫ్2 సినిమా గతంలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, ఎఫ్2 సినిమాకు సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక రీసెంట్‌గా ఈ సీక్వెల్ మూవీని రిలీజ్ కూడా చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ఎఫ్3 అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

F3 Movie : F3 మూవీ ఓటీటీలో వచ్చేది అప్పుడే.. వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..

టీజర్, ట్రైలర్లతోనే ఈ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. ఇక మే 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్ చేశారు. ఈ సినిమాను కూడా దర్శకుడు పూర్తిగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఆడియెన్స్‌తో కిటకిటలాడింది. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది.

F3 Movie : హిట్ సినిమాని బాగోలేదని ప్రచారం చేస్తున్నారు.. F3 సక్సెస్ మీట్‌లో సీరియస్ అయిన ఆలీ..

ఇప్పటికే ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ వసూళ్ల మార్క్‌కు చేరువలో ఉంది. ఈ సినిమాను అందరూ చూసే విధంగా ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండానే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపారు. ఇక ఈ సినిమాలో మరోసారి ఎఫ్2 క్యాస్టింగ్ పూర్తిగా కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది. ఇక రూ.50 కోట్ల మార్క్‌ను ఈ వీకెండ్‌లో ఖచ్చితంగా అందుకుంటుందని ఎఫ్3 చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా.. ఎఫ్3 సినిమా తొలి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 16.40 కోట్లు
సీడెడ్ – 5.38 కోట్లు
ఉత్తరాంధ్ర – 5.18 కోట్లు
ఈస్ట్ – 2.86 కోట్లు
వెస్ట్ – 2.10 కోట్లు
గుంటూరు – 2.82 కోట్లు
కృష్ణా – 2.48 కోట్లు
నెల్లూరు – 1.55 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 38.77 కోట్లు (రూ.62.15 కోట్లు గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 2.65 కోట్లు
ఓవర్సీస్ – 6.75 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.48.17 కోట్లు (రూ.80.40 కోట్లు గ్రాస్)