Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్

F3 మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్న పంజాబీ హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా..రోడ్డుపై డ్యాన్స్‌ చేస్తూ..కనిపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Punjab : రోడ్డుపై స్టెప్పులు వేసిన F3 హీరోయిన్.. వీడియో వైరల్

New Project (20)

Punjab :  F3 మూవీతో సూపర్‌ హిట్‌ అందుకున్న పంజాబీ హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా..రోడ్డుపై డ్యాన్స్‌ చేస్తూ..కనిపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తన బంధువుల పెళ్లికి హాజరైన ఈ అందాల బామ.. బారాత్‌లో ఓ అమ్మాయితో కలిపి స్టెప్పులు వేసి అలరించింది. వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌లో మెహ్రీన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Sankranthi Movies : అప్పుడే సంక్రాంతి పోటీకి సిద్దమైన హీరోలు..
పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్‌ డ్యాన్స్‌ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. పంజాబీ వెడ్డింగ్‌ సీన్స్‌ అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ప్రసుత్తం మెహ్రీన్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్ల కొడుతుంది. నేచురల్ స్టార్ నాని హీరో సరసన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బామ వరస హిట్లు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఐదు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. మళ్లీ  F2, దానికి సీక్వెల్‌గా వచ్చిన F3 మూవీ మంచి విజయం సాధించడంతో..ఫుల్‌ జోష్‌లో ఉంది.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN ?? (@mehreenpirzadaa)