Sunil Babu : టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కన్నుమూత..

తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మరణించారు. యనకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో 50 ఏళ్ళ వయసులో చికిత్స తీసుకుంటూ కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో మరణించారు. సునీల్ బాబుకి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇటీవల ఆయన.........

famous art director Sunil Babu passes away

Sunil Babu :  గత సంవత్సరం టాలీవుడ్ లో అనేక విషాదాలు ఏర్పడ్డాయి. పలువురు స్టార్లు, ప్రముఖులు కన్నుమూశారు. ఆ విషాదాల్లోంచి టాలీవుడ్ ఇంకా కోలుకోకముందే మళ్ళీ వరుస విషాదాలు నెలకొంటున్నాయి. రెండు రోజుల క్రితమే ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి మరణించారు. తాజాగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు మరణించారు.

సినీ పరిశ్రమలోకి ఆర్ట్ డిపార్ట్మెంట్ లో సెట్ బాయ్ గా వచ్చి కష్టపడి సీనియర్ కళాదర్శకుడు సాబుసిరిల్ వద్ద శిష్యుడిగా పనిచేసి అనంతరం ఆర్ట్ డైరెక్టర్ గా ఎదిగారు సునీల్ బాబు. తెలుగు, తమిళ్, హిందీ లో ఎన్నో సినిమాలకి ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసి తన ప్రతిభతో మెప్పించారు. గజిని, లక్ష్యం, ఎంఎస్ ధోని, సీతారామం, వారసుడు.. లాంటి పలు స్టార్ సినిమాలకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసారు సునీల్ బాబు. కేరళకి చెందిన సునీల్ బాబు ఎన్నో మలయాళం సినిమాలకి కూడా ఆర్ట్ డైరెక్టర్ పనిచేశారు. ఆయనకి హఠాత్తుగా గుండెపోటు రావడంతో 50 ఏళ్ళ వయసులో చికిత్స తీసుకుంటూ కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో మరణించారు.

Unstoppable : కృష్ణంరాజుని తలుచుకొని ఏడ్చేసిన ప్రభాస్.. అన్‌స్టాపబుల్ స్టేజిపై రెబల్ స్టార్‌కి నివాళులు..

దీంతో సునీల్ బాబుకి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇటీవల ఆయన సీతారామం సినిమాకి అందంగా కళా దర్శకత్వం చేశారు. సునీల్ బాబు చివరగా వారసుడు సినిమాకి పనిచేశారు. ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఇలా హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు.