GG Krishna Rao : సినీ పరిశ్రమలో మరో విషాదం.. మొన్న డైరెక్టర్.. నేడు ఎడిటర్.. శంకరాభరణం ఎడిటర్ కన్నుమూత..

ప్రముఖ సీనియర్ ఎడిటర్ జి.జి.కృష్ణారావు ఈరోజు ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఎడిటర్ గా దాదాపు 200కి పైగా సినిమాలకు పనిచేశారు. దాసరి నారాయణరావు, K విశ్వనాథ్, బాపు, జంధ్యాల.. లాంటి సీనియర్ స్టార్ దర్శకుల వద్ద ఆయన పనిచేశారు. ముఖ్యంగా K విశ్వనాథ్ గారి చాలా సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా................

GG Krishna Rao : సినీ పరిశ్రమలో మరో విషాదం.. మొన్న డైరెక్టర్.. నేడు ఎడిటర్.. శంకరాభరణం ఎడిటర్ కన్నుమూత..

Famous senior Editor sankarabharanam editor GG Krishnarao passes away

Updated On : February 21, 2023 / 9:22 AM IST

GG Krishna Rao :  సినీ పరిశ్రమని వరుస విషాదాలు వదలట్లేదు. గత కొంతకాలంగా సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తూ తీవ్ర విషాదాన్ని నెలకొల్పుతున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితమే దర్శకుడు K విశ్వనాధ్, మూడు రోజుల క్రితం నటుడు తారకరత్న కన్నుమూయగా తాజాగా ప్రముఖ సీనియర్ ఎడిటర్ జి.జి.కృష్ణారావు కన్నుమూశారు.

ప్రముఖ సీనియర్ ఎడిటర్ జి.జి.కృష్ణారావు ఈరోజు ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఎడిటర్ గా దాదాపు 200కి పైగా సినిమాలకు పనిచేశారు. దాసరి నారాయణరావు, K విశ్వనాథ్, బాపు, జంధ్యాల.. లాంటి సీనియర్ స్టార్ దర్శకుల వద్ద ఆయన పనిచేశారు. ముఖ్యంగా K విశ్వనాథ్ గారి చాలా సినిమాలకు కృష్ణారావు ఎడిటర్ గా పనిచేశారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, శుభసంకల్పం, స్వరాభిషేకం.. ఇలా K విశ్వనాధ్ గారు తెరకెక్కించిన చాలా సినిమాలకు ఆయన ఎడిటర్ గా పనిచేసి మూడు సార్లు నంది అవార్డుని కూడా గెలుచుకున్నారు.

#DPIFF2023 : దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 పూర్తి సమాచారం..

ఇటీవలే కొన్ని రోజుల క్రితం దర్శకుడు కళాతపస్వి K విశ్వనాధ్ మరణించగా, నేడు ఆయన సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి, ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగే కృష్ణారావు మరణించడం చాలా బాధాకరం. దీంతో పలువురు సినీ ప్రముఖులు కృష్ణారావు మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.