Chiranjeevi : 6 రూపాయల టికెట్ బ్లాక్ లో 210 రూపాయలకు కొన్న అభిమాని.. అదీ మెగాస్టార్ రేంజ్ అంటే.. ఏ సినిమాకో తెలుసా?

మెగాస్టార్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు మూవీ యూనిట్.

Chiranjeevi : ఇప్పుడంటే టికెట్ రేట్లు వందల్లో ఉంటున్నాయి కానీ ఒకప్పుడు టికెట్ రేట్లు రూపాయి నుంచి 10 రూపాయలు రేట్లు కూడా ఉండేవని తెలిసిందే. తాజాగా మెగాస్టార్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు మూవీ యూనిట్.

మెగాస్టార్ చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మూవీ యూనిట్ పంచుకుంటున్నారు. తాజాగా మూవీ యూనిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజయినప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయి భారీ డిమాండ్ ఉండటంతో ఆరు రూపాయల టికెట్ ని 210 రూపాయలకు బ్లాక్ లో అమ్మారు అని అప్పటి పేపర్లో పడిన విషయాన్ని షేర్ చేసారు.

Also Read : Sailesh Kolanu : హిట్ 3 షూటింగ్ లో నాని తలకు గాయం.. రక్తం కారినా షూటింగ్.. శైలేష్ కొలను పోస్ట్ వైరల్..

అప్పట్లో సూపర్ హిట్ సినిమాలకు బాగా డిమాండ్ ఉంటె ఫ్యాన్స్ బ్లాక్ లో టికెట్స్ కొనుక్కొని మరీ వెళ్లేవారు. అలా ఓ చిరంజీవి అభిమాని సినిమా చూడటానికి ఆరు రూపాయల టికెట్ 210 రూపాయలు పెట్టి కొనుక్కొని చూసాడంటే మాములు విషయం కాదు. అదీ కదా మెగాస్టార్ రేంజ్ అంటే.

చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కింది. 1990ల్లో 2 కోట్లు పెట్టి తీస్తే ఈ సినిమా అప్పట్లోనే 15 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు రీ రిలీజ్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.

Also See : Ariyana Glory : హిమాచల్ ప్రదేశ్ లో వెకేషన్.. మంచులో ఎంజాయ్ చేస్తున్న అరియనా గ్లోరీ..