Sailesh Kolanu : హిట్ 3 షూటింగ్ లో నాని తలకు గాయం.. రక్తం కారినా షూటింగ్.. శైలేష్ కొలను పోస్ట్ వైరల్..

తాజాగా నాని గాయం గురించి శైలేష్ కొలను తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

Sailesh Kolanu : హిట్ 3 షూటింగ్ లో నాని తలకు గాయం.. రక్తం కారినా షూటింగ్.. శైలేష్ కొలను పోస్ట్ వైరల్..

Sailesh Kolanu Post on Nani Injury in Hit 3 shooting

Updated On : May 4, 2025 / 12:15 PM IST

Sailesh Kolanu : శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 సినిమా ఇటీవల మే 1 న రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లో 82 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ ప్రకటిచింది. త్వరలో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ దాటనుంది. ఈ సినిమాలో మొదటిసారి నాని బాగా వైలెంట్ గా కనిపించాడు. ఈ సినిమా కోసం నాని బాగా కష్టపడ్డాడు.

ఇటీవల శైలేష్ కొలను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీనగర్ లో ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కెమెరా నాని తలకు తగిలి చీలి రక్తం కారింది. అప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేసి షూటింగ్ పూర్తిచేసాడు. షూట్ అవ్వగానే ఢిల్లీకి నైట్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఉదయాన్నే మళ్ళీ శ్రీనగర్ వచ్చి అక్కడ్నుంచి షూటింగ్ లొకేషన్ కి వచ్చాడు. నాని డెడికేషన్ అలా ఉంటుంది అని చెప్పాడు.

Also Read : Mumaith Khan : నా బ్రెయిన్ లో 9 వైర్స్ ఉన్నాయి.. మెడిసిన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యా.. పాపం ఏడేళ్లు ముమైత్ కష్టాలు..

తాజాగా ఆ గాయం గురించి శైలేష్ కొలను తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నాని ఓ సీన్ లో కొంతమందిని కొడుతూ ఉంటాడు. అప్పుడు సడెన్ గా కెమెరాకు నాని తల తగిలడంతో నాని నుదురు మీద చీలుకుపోయి రక్తం వచ్చింది. దానికి సంబంధించిన షూట్ విజువల్స్ ని శైలేష్ కొలను పోస్ట్ చేసాడు. నాని నుదురు మీద అయిన గాయాల ఫోటోలను కూడా పోస్ట్ చేసాడు.

ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. నేను చెప్పింది దీని గురించే. ఆ దెబ్బ తగిలిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ షాట్ కి రెడీ అయిపోయాడు నాని. ప్రపంచంలో ఉన్న గౌరవం అంతా ఇతనికే దక్కాలి. సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ ఒక వ్యాధి లాంటిది. మీతో పాటు నన్ను ప్రయాణించేలా చేసినందుకు ధన్యవాదాలు. హిట్ 3 నా జర్నీలో ఎప్పటికి గుర్తుండిపోతుంది. లవ్ యు అంటూ నాని పై తనకున్న ప్రేమను రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా సినిమా అంటే నానికి ఇంత పిచ్చా అని ఫ్యాన్స్, నెటిజన్లు మరోసారి అభినందిస్తున్నారు.

Also Read : Nani : అమెరికాలో నాని మరో కొత్త రికార్డ్.. అమెరికా మార్కెట్ అంటే నాని అడ్డా అయిపోయింది.. మహేష్ తర్వాత నానినే..