Nani : అమెరికాలో నాని మరో కొత్త రికార్డ్.. అమెరికా మార్కెట్ అంటే నాని అడ్డా అయిపోయింది.. మహేష్ తర్వాత నానినే..
ఇటీవల మన హీరోలు అమెరికాకు వెళ్లి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారంటే అక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

Nani Creates New Record in America Collections with HIT 3 Movie
Nani : ఇండియన్ సినిమాలకు, ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో కూడా మన సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అవుతాయి. ఇటీవల మన హీరోలు అమెరికాకు వెళ్లి కూడా ప్రమోషన్స్ చేస్తున్నారంటే అక్కడ ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.
అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మన రూపాయల్లో దాదాపు 8 కోట్లు కలెక్ట్ చేస్తే మంచి కలెక్షన్స్ వచ్చినట్టే. అమెరికాలో(America) 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రావాలని స్టార్ హీరోల అభిమానులు కూడా కోరుకుంటారు. అమెరికాలో ఇప్పటివరకు ఎక్కువ 1 మిలియన్ డాలర్ సినిమాలు సాధించిన హీరో మహేష్ బాబు. మహేష్ బాబు ఏకంగా 12 సినిమాలకు 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించాడు అమెరికాలో. ఆ తర్వాత లిస్ట్ లో నానినే ఉన్నారు.
Also Read : Sreeleela: క్లారిటీ వచ్చేసింది.. ఈ పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల..
నానికి మొన్నటి వరకు 10 సినిమాలు ఉండగా తాజాగా రిలీజయిన హిట్ 3 సినిమా కూడా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేయడంతో నాని ఇప్పటివరకు మొత్తం 11 సినిమాలతో అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. నాని తర్వాతే జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, రామ్ చరణ్.. లాంటి స్టార్స్ ఉండటం గమనార్హం.
ఇక హిట్ 3 సినిమా ఇప్పటికే దాదాపు 70 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 100 కోట్లకు దూసుకెళ్తుంది. అమెరికాలో కూడా ఆల్మోస్ట్ 2 మిలియన్ డాలర్స్ కి చేరువలో ఉంది. అలాగే నాని బ్యాక్ టు బ్యాక్ వరుసగా 4 సినిమాలకు 1.5 మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసాడు. మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తర్వాత నానినే ఈ రికార్డ్ సాధించాడు.
Also Read : HIT 3 collections : బాక్సాఫీస్ వద్ద నాని జోరు.. రెండు రోజుల్లో ‘హిట్ 3’వసూళ్లు ఎంతంటే..?
మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆ సినిమా వచ్చేలోపు నాని ఇంకో రెండు సినిమాలు రిలీజ్ చేసి అమెరికాలో మహేష్ రికార్డ్ ని దాటేసి 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తాడని ఫ్యాన్స్, టాలీవుడ్ జనాలు అంటున్నారు. నాని కంటెంట్ ని నమ్ముకొని వరుస హిట్స్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు.