HIT 3 collections : బాక్సాఫీస్ వ‌ద్ద నాని జోరు.. రెండు రోజుల్లో ‘హిట్ 3’వ‌సూళ్లు ఎంతంటే..?

బాక్సాఫీస్ వ‌ద్ద నాని హిట్ 3 మూవీ దూసుకుపోతుంది.

HIT 3 collections : బాక్సాఫీస్ వ‌ద్ద నాని జోరు.. రెండు రోజుల్లో ‘హిట్ 3’వ‌సూళ్లు ఎంతంటే..?

Nani Hit 3 two Days Collections

Updated On : May 3, 2025 / 10:49 AM IST

నాని హీరోగా న‌టించిన చిత్రం ‘హిట్‌3: ది థర్డ్‌ కేస్‌’. శైలేష్ కొలను దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి క‌థానాయిక‌. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీని నిర్మించారు. ఈ క్రైమ్ థిల్ల‌ర్.. తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో గురువారం (మే 1)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. తొలి రోజే రూ.43 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నాని కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.

Garuda 2.0 : ‘గరుడ 2.0’ రివ్యూ.. వరుస హత్యలతో సస్పెన్స్ థ్రిల్లర్..

ఇక రెండు రోజుల్లో ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా 62 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని ఓ పోస్ట‌ర్ ద్వారా సోష‌ల్ మీడియా వేదిక‌గా చిత్ర బృందం తెలియ‌జేసింది.

ఇక ఈరోజు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈ చిత్ర వ‌సూళ్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రం ఈజీగా 150 కోట్ల మార్క్‌ను అందుకుంటుంద‌ని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.