Garuda 2.0 : ‘గరుడ 2.0’ రివ్యూ.. వరుస హత్యలతో సస్పెన్స్ థ్రిల్లర్..

తమిళ సినిమా ఆరత్తు సీనం తెలుగులో గరుడ 2.0 అనే టైటిల్ తో డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు.

Garuda 2.0 : ‘గరుడ 2.0’ రివ్యూ.. వరుస హత్యలతో సస్పెన్స్ థ్రిల్లర్..

Aishwarya Rajesh Arulnithi Garuda 2.0 Movie Review

Updated On : May 2, 2025 / 8:15 PM IST

Garuda 2.0 Movie Review : అరుళ్ నీతి, ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దుత్త.. మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన తమిళ సినిమా ఆరత్తు సీనం. ఈ సినిమాని తెలుగులో గరుడ 2.0 అనే టైటిల్ తో డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. వైశాలి లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన అరివాజగన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

కథ విషయానికొస్తే.. పోలీస్ ఆఫీసర్ అరవింద్(అరుళ్ నీతి) ఓ రౌడీ షీటర్ ని ఎన్ కౌంటర్ చేయడానికి వెళ్తాడు. కానీ చివరి నిమిషంలో పై ఆఫీసర్స్ వల్ల ఆపేయాల్సి వస్తుంది. అప్పటికే ఆ రౌడీకి సంబంధించిన పలువురు చనిపోతారు. కొన్నాళ్ల తర్వాత అరుళ్ నీతి భార్య(ఐశ్వర్య రాజేష్), పాప చనిపోవడంతో ముందుకు బానిస అవుతాడు. అలాంటి సమయంలో వరుసగా ఇద్దరు మగవాళ్ళు కనిపించకుండా పోయి మూడు రోజుల తర్వాత శవమై కనిపిస్తారు.

ఆ కేసుని ACP(రోబో శంకర్)కి అప్పగిస్తారు. కానీ అతను కామెడీ పోలీస్ కావడంతో కేసుని సీరియస్ గా తీసుకోడు. ఓ సీనియర్ ఆఫీసర్ అరవింద్ ని చూడటంతో ఎలాగైనా ఈ కేసుని అతనికి అప్పగించాలి అనుకుంటాడు. మొదట ఒప్పుకోకపోయినా ఆ తర్వాత కేసు టేకప్ చేస్తాడు అరవింద్. ఆ తర్వాత కూడా అలాగే మరో ఇద్దరు మగవాళ్లు హత్య చేయబడతారు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? అరవింద్ ఈ కేసుని ఎలా డీల్ చేసాడు? ఆ మగవాళ్లందరికి కనెక్షన్ ఏంటి? అరవింద్ భార్య, పాప ఎలా చనిపోయారు? ఎన్ కౌంటర్ లో మిస్ అయిన రౌడీ షీటర్ ని చంపాడా.. ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

Also Read : Manchu Vishnu : ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ పిల్లల బాధ్యత తీసుకున్న మంచు విష్ణు.. అభినందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

సినిమా విశ్లేషణ.. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. తమిళ్ లో 2016 లోనే ఈ సినిమా రిలీజవ్వగా ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి ఆహా ఓటీటీలో రిలీజ్ చేయడం గమనార్హం. అరవింద్ కేసు టేకప్ తీసుకునేదాకా సినిమా బాగా సాగదీశారు. హత్యలు జరుగుతుంటే పోలీస్ సీరియస్ గా తీసుకోకపోవడం సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. అరవింద్ భార్య, పాపలకు సంబంధించి సింపుల్ రివెంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఓ సీన్ లో సీనియర్ ఆఫీసర్ అరవింద్ గురించి భారీ ఎలివేషన్స్ ఇస్తాడు. కానీ దానికి తగ్గ ఎస్టాబ్లిషమెంట్ చూపించలేదు.

ఇక అరవింద్ కేసు టేకప్ చేసిన దగ్గర్నుంచి మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆసక్తికరంగా అసాగుతుంది. అసలు హత్యలు ఎవరు? ఎందుకు చేస్తున్నారు అని ఎవరూ ఊహించలేరు. ఆ ట్విస్ట్ లు కూడా బాగుంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మెప్పిస్తుంది. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా బాగా రాసుకున్నారు. అయితే తెలుగు డబ్బింగ్ కి ఈ టైటిల్ ఎందుకు పెట్టారో మాత్రం సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన వాళ్ళకే తెలియాలి.

Garuda 2.0 review

నటీనటుల పర్ఫార్మెన్స్.. అరుళ్ నీతి సిన్సియర్ పోలీసాఫీసర్ గా, ముందుకు బానిసైన వ్యక్తిగా బాగా నటించాడు. ఐశ్వర్య రాజేష్ కాసేపే కనిపించి అలరిస్తుంది. ఐశ్వర్య దుత్త జర్నలిస్ట్ పాత్రలో ఓకే అనిపిస్తుంది. రోబో శంకర్ కామెడీ పోలీస్ గా పర్వాలేదనిపిస్తాడు. గౌరవ్ నారాయణన్, రాధా రవి, చార్లీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Hit 3 : ‘హిట్ 3’ మూవీ రివ్యూ.. నాని రక్తపాతం.. ఫ్యామిలీతో మాత్రం వెళ్ళకండి..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సస్పెన్స్ థ్రిల్లింగ్ కి పర్ఫెక్ట్ సెట్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు. ఉన్న ఒక్క పాట యావరేజ్. మర్డర్స్ మిస్టరీ రొటీన్ అయినా హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేది కొత్తగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా గరుడ 2.0 సినిమా మర్డర్ మిస్టరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.