Manchu Vishnu : ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ పిల్లల బాధ్యత తీసుకున్న మంచు విష్ణు.. అభినందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి మధుసూదన్ కుటుంబ సభ్యులను నేడు మంచు విష్ణు కలిసి పరామర్శించారు.

Manchu Vishnu : ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ పిల్లల బాధ్యత తీసుకున్న మంచు విష్ణు.. అభినందిస్తున్న ఫ్యాన్స్, నెటిజన్లు..

Manchu Vishnu Adopted Madhusudhan Childrens for Their Study

Updated On : May 2, 2025 / 7:14 PM IST

Manchu Vishnu : ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో పలువురు పర్యాటకులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఏపీ కావలికి చెందిన మధుసూదన్ అనే వ్యక్తి కూడా మరణించారు. ఇప్పటికే మధుసూదన్ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్, పలువురు రాజకీయ నాయకులు కలిసి పరామర్శించారు. జనసేన పార్టీ తరపున ఆ కుటుంబానికి ఆర్ధిక సాయం కూడా ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు ఆ కుటుంబాన్ని కలిశారు.

ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి వాసి మధుసూదన్ కుటుంబ సభ్యులను నేడు మంచు విష్ణు కలిసి పరామర్శించారు. దాడి జరిగిన తీరును మధుసూధన్ సతీమణి కామాక్షి, పిల్లలను అడిగి తెలుసుకున్నారు. మధుసూధన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. పిల్లల బాధ్యతను తీసుకొని వారిని దత్తత తీసుకొని విద్యాభ్యాసానికి అండగా ఉంటాను అని తెలిపారు.

Also Read : Tejaswi Madivada : అమ్మ పదేళ్లకే చనిపోయింది.. ఆ ఫ్యామిలీ ఫుడ్ పెడతా అన్నారు.. ఏడ్చేసిన తేజస్వి.. అనసూయ ఎమోషనల్..

ఇప్పటికే మంచు విష్ణు తిరుపతిలో 120 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వాళ్లందరికీ విద్య, నిత్యావసరాలు.. కావాల్సినవి అందిస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా అండగా నిలబడతాను చెప్పడంతో ఆయన ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇక మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది.

Manchu Vishnu

Also Read : Komalee Prasad : హిట్ 3 వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కోమలీ ప్రసాద్.. అడవుల్లో ఎంత కష్టపడుతుందో..