Tejaswi Madivada : అమ్మ పదేళ్లకే చనిపోయింది.. ఆ ఫ్యామిలీ ఫుడ్ పెడతా అన్నారు.. ఏడ్చేసిన తేజస్వి.. అనసూయ ఎమోషనల్..
ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది.

Tejaswi Madivada gets Emotional while Tells about her Family
Tejaswi Madivada : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ తో సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మడివాడ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా పలు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది తేజస్వి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది.
ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది. ఈ షోలో ఫ్యామిలీ థీమ్ ఎపిసోడ్ రాబోతుండగా దానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు. ఇందులో తేజస్వి మడివాడ రోహిత్ భరద్వాజ్ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ తన ఫ్యామిలీ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.
Also See : Shriya Saran : భర్త, కూతురుతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ శ్రియ.. ఫొటోలు చూశారా?
తేజస్వి మడివాడ మాట్లాడుతూ.. మా అమ్మ పదేళ్లకే చనిపోయింది. మా నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు దాంతో నేను 18 ఏళ్ళప్పుడు ఇంట్లోంచి బయటికి వచ్చేసాను. నన్ను అప్పట్నుంచి ఈ రోహిత్ భరద్వాజ్ ఫ్యామిలీనే చూసుకుంటుంది. వీళ్ళు నాకు లైఫ్ లాంగ్ ఫుడ్ పెడతా అన్నారు. నాకు వీళ్ళే ఫ్యామిలీ. నేను ఎప్పుడూ జనాల్లోనే ఉండటానికి ప్రిఫర్ చేస్తాను. నాకు ఎప్పుడూ ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేను షూటింగ్ సెట్ కి వచ్చి ఇక్కడ జనాలని చూస్తే నాకు పండగలా ఉంటుంది అంటూ ఏడ్చేసింది.
దీంతో ఆ షోలో జడ్జిగా చేస్తున్న అనసూయ కూడా ఎమోషనల్ అయింది. ఎప్పుడూ నవ్వించే తేజస్వి వెనక ఇంత బాధ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.