Mumaith Khan : నా బ్రెయిన్ లో 9 వైర్స్ ఉన్నాయి.. మెడిసిన్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యా.. పాపం ఏడేళ్లు ముమైత్ కష్టాలు..
తాజాగా ముమైత్ ఖాన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన హెల్త్ కష్టాలు చెప్పింది.

Mumaith Khan tells about her Health Conditions
Mumaith Khan : ఇప్పటికింకా నా వయసు.. లాంటి బోలెడన్ని ఐటెం సాంగ్స్ తో టాలీవుడ్ లో ఫుల్ పేరు తెచ్చుకుంది ముమైత్ ఖాన్. డ్యాన్స్ లతో పాటు పలు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేసి పాపులర్ అయింది. అయితే ఓ ఆరేడేళ్లుగా ముమైత్ కనిపించలేదు. ఇన్నేళ్లు గ్యాప్ తీసుకొని ఇటీవలే మళ్ళీ టీవీ షోలు, బిజినెస్ లతో బిజీ అవుతుంది.
తాజాగా ముమైత్ ఖాన్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన హెల్త్ కష్టాలు చెప్పింది. కొన్ని రోజుల క్రితం కూడా తన బిజినెస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో.. ఇంట్లో డ్యాన్స్ వేస్తుంటే కాలు స్లిప్ అయి పడి బ్రెయిన్ లో నరాలు కట్ అయ్యాయి, సర్జరీ అయింది, 15 రోజులు కోమాలో ఉన్నాను, కొంత మెమరీ లాస్ అయింది అని చెప్పుకొచ్చింది.
Also See : Ariyana Glory : హిమాచల్ ప్రదేశ్ లో వెకేషన్.. మంచులో ఎంజాయ్ చేస్తున్న అరియనా గ్లోరీ..
తాజాగా ముమైత్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నా బ్రెయిన్ లో 9 వైర్స్ ఉన్నాయి. నా సర్జరీ అయ్యాక మూడు నెలలు అవ్వగానే సూపర్ షో చేయడానికి వచ్చాను. పెద్ద సౌండ్ వచ్చినా తట్టుకోలేను. అలాంటిది స్టంట్స్ చేశాను. నెక్స్ట్ డే నేను పొద్దున్నే లెగలేదు. అందరూ కంగారు పడ్డారు. హాస్పిటల్ కి తీసుకెళ్లారు. నా సర్జరీ తర్వాత డాక్టర్స్ ఏడేళ్లు రెస్ట్ తీసుకోమన్నారు. పని చేయొద్దు అన్నారు. నేను పని చేయకపోతే ఎలా బతకాలి అనుకున్నాను, కానీ తప్పలేదు. మెడిసిన్స్ వల్ల లావు అయ్యాను, ఫేస్ పాడైపోయింది. ఈ ఫీల్డ్ లో ఫేస్, ఫిట్నెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా మీద నేను ఫోకస్ చేసి గతంలో ఉన్నట్టు రెడీ అయి బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఒక టీవీ షో చేస్తున్నాను. కొత్త బిజినెస్ మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చింది. దీంతో పాపం ముమైత్ ఏడేళ్లుగా ఎన్ని కష్టాలు పడిందో అని అనుకుంటున్నారు.