Fans are protesting to let see Krishna and pay them last respects
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందడంతో ఘట్టమనేని కుటుంబంతో సహా యావత్తు సినీ ప్రపంచం దిగ్బ్రాంతికి లోనయ్యింది. అయన అకాల మరణానికి చింతిస్తూ సినీ, రాజకీయ ప్రముఖులు అయనకు నివాళ్లు అర్పిస్తున్నారు. ఇక అభిమానుల సందర్శనార్థం కోసం ఆయన భౌతికకాయాన్ని నిన్న సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారని కుటుంబ సభ్యులు తొలుత తెలిపారు.
Super Star Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణకు కుటుంబ సభ్యుల నివాళి
అయితే కొన్ని కారణాల వల్ల కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని ఇంటివద్దే ఉంచాల్సి వచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఇంటివద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసుకునేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానాలు.. రాత్రి నుంచి చలిలో కృష్ణ గారి ఇంటి బయటే ఉన్నా, ఇంకా తమని లోపాలకి అనుమతించడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఉదయం వరకు ఎదురుచూసాక, ఇప్పుడు పద్మాలయ స్టూడియోస్ కి వెళ్ళండి అక్కడ సందర్శించుకుందురు అని చెప్పడంతో.. ఫ్యాన్స్ కృష్ణ గారి ఇంటి బయట ఆందోళనకు దిగారు. కాగా మరికాసేపటిలో కృష్ణ గారి భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోస్ తరలించనున్నారు. మధ్యాహ్నం నుంచి మహాప్రస్థానంకి తరలించి అక్కడ కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.